Salaar Closing Collections సలార్ బడ్జెట్ 400 కోట్లు.. ప్రభాస్ మూవీకి ఎన్ని వందల కోట్ల లాభమంటే?
కేజీఎఫ్, కాంతార లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హోంబలే బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం సలార్: పార్ట్ 1 సీజ్‌ఫైర్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. అయితే ఈ సినిమా ఎంత బడ్జెట్‌తో తెరకెక్కించారు? బిజినెస్ ఎంత అయింది? కలెక్షన్లు ఎంత మేరకు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
కన్నడలో ఘన విజయం సాధించిన ఉగ్రం సినిమా అధారంగా తెరకెక్కించిన సలార్ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్‌కు మంచి క్రేజ్, బజ్ క్రియేట్ కావడంతో రికార్డు స్థాయిలో 350 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.

సలార్ సినిమా ఏరియా వారిగా బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా, నైజాంలో కలిపి 144 కోట్ల రూపాయల ముందస్తు బిజినెస్ జరిగింది. తమిళనాడు థియేట్రికల్ హక్కులను 12 కోట్లకు, కర్ణాటక హక్కులు 30 కోట్లు, కేరళ 6 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల హక్కులు 82 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ హక్కులు 75 కోట్ల మేర అమ్ముడు పోయాయి. దాంతో ఈ సినిమా హక్కులు మొత్తంగా 350 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది.
ఇక సలార్ సినిమా తొలివారం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ 192 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు, కర్ణాటకలో 35 కోట్లు, తమిళనాడులో 19 కోట్లు, కేరళలో 14 కోట్లు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 104 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలివారం బాక్సాఫీస్ వద్ద 364 కోట్ల రూపాయల నికర వసూళ్లు రాబట్టింది.
ఇక సలార్ మూవీ రెండోవారం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, నైజాంలో 25 కోట్లకుపైగా, కర్ణాటకలో 5.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4 కోట్ల రూపాయలు, కేరళలో 3 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 46 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 83 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఇక సలార్ చిత్రం మూడో వారం వసూళ్ల విషయానికి వసత్ే.. తెలుగులో 5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, తమిళంలో 2 కోట్ల రూపాయలు, మలయాళంలో 1 కోటి రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయలతో కలిపి మొత్తంగా ఈ మూవీ 29 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

ఇక నాలుగో వారంలో సలార్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 475 కోట్ల నికర వసూళ్లను, ఓవర్సీస్‌లో 17 మిలియన్ డాలర్లు అంటే 137 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. దాంతో ఈ సినిమా 630 కోట్ల రూపాయలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జర్నీని ముగించింది.
సలార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఏపీ, నైజాం హక్కులు 144 కోట్లకు అమ్ముడుపోగా 222 కోట్లు, కర్ణాటకలో 30 కోట్లకు గాను 42 కోట్లు, తమిళంలో 12 కోట్లకు గాను 24 కోట్లు, మలయాళంలో 6 కోట్లకు 17 కోట్లు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 82 కోట్లకు గాను 170 కోట్లు వసూలు చేసింది. 350 రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండగా 475 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో డిస్టిబ్యూటర్లకు దండిగా లాభాలను పంచింది.


Click it and Unblock the Notifications











