For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సలీం,కథ,వాడే కావాలి..రిజల్ట్ ఒకటే (ట్రేడ్ టాక్)

    By Srikanya
    |

    రిలీజ్ డేట్ మార్చుకుంటామంటూనే ఈ వారం సలీం, కథ,వాడే కావాలి అంటూ మూడు చిత్రాలు రిలీజయ్యాయి. అయితే మూడూ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నారు. వీటిలో మొదటగా శాయిరామ్ శంకర్ హీరోగా వచ్చిన వాడే కావాలి శుక్రవారం రిలీజైంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కథను గుర్తు చేసే ఈ చిత్రం ఆ మాత్రం డ్రామా, ఫన్ కూడా లేక మార్నింగ్ షో కే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. దాంతో బంపర్ ఆఫర్ ఫరవాలేదనిపించుకున్న శాయిరామ్ శంకర్ తిరిగి వెనక్కి వెళ్ళిపోయినట్లయింది. ఇక గుణ్ణం గంగరాజు,జెనీలియా కాంబినేషన్ లో వచ్చిన కథ చిత్రం కథ లేకే ఫ్లాపయింది అంటున్నారు. అందులోనూ స్లో నేరేషన్ కథన వేగాన్ని చంపేసింది. ఎక్కడో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కోసం సినిమా చివరి దాకా భరించటం అన్నది కష్టమేనంటున్నారు.

    వీటికి తోడు జెనీలియా నుంచి హాసిని వంటి ఉషారైన పాత్రను ఆశించి వారికి తల్లి,తండ్రి చనిపోయి ఆ మెంటల్ షాక్ లో ఉండి ట్రీట్ మెంట్ తీసుకోవంటం వంటి సీన్స్ ని డైజస్ట్ చేసుకోవటం కష్టమేనంటున్నారు. ఇక చివరగా మంచి హైప్ తో అంతకు మించి అధిక బడ్జెట్టుతో సలీం రిలీజైంది. నమస్తే లండన్ స్టోరీ లైన్ ని కొద్ది గామార్చి,తషాన్ లోని అనిల్ కపూర్ ట్రాక్ కలిపి నవ్వించే ప్రయత్నం చేసారు. అయితే అటు ప్రేమ,ఇటు కామిడీ ఏదీ పండక ప్రేక్షకులకు సహన పరీక్ష పెట్టింది. దాంతో ఇదీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. వైవియస్ చౌదిరి కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిన ఒక్క మగాడుతో దీన్ని పోలుస్తున్నారు. ఇలియానా స్కిన్ షో కూడా ఈ చిత్రం ప్లాప్ ని ఆపలేకపోవటం మరో విషాదం. అదీ ఈ వారం రిలీజైన చిత్రాల సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X