టార్గెట్ అందుకోలేక బడా హీరో చిత్రం బోల్తా
ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'ఏక్ థా టైగర్' చిత్రం దుమ్మురేపే కలెక్షన్లతో మొదలైనప్పటికీ ఐదు వారాలు గడిచినా రూ. 200 కోట్ల మ్యాజిక్ ఫిగర్ అందుకోలేక పోయింది. తొలి 5 రోజుల్లోనే 100 కోట్లు కలెక్షన్లు సాధించిన ఈచిత్రం తొలివారం తన హవా కొనసాగించినప్పటికీ...రెండో వారం నుంచి కలెక్షన్లు డ్రాప్ అవుతూ వచ్చాయి.
రెండు వారాల్లో రూ. 200 కోట్లు వసూలు చేస్తుందని అనుకున్నప్పటికీ కొద్దిపాటి తేడాతో అంచనాలు మిస్సయి రూ. 185 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే తొలి 2 వీకెండ్లలోనూ ఇండియన్ బాక్సాఫీసు వద్ద టాప్ పొజిషన్లో కొనసాగింది. అయితే రాను రాను సినిమా కలెక్షన్లు పూర్తిగా పడి పోయాయి. రణబీర్ కపూర్ 'బర్ఫీ', ఇమ్రాన్-బిపాసా 'రాజ్-3' చిత్రాల ఎఫెక్టుతో ప్రస్తుతం 'ఏక్ థా టైగర్' చిత్రం పూర్తిగా వెనక పడిపోయింది.
నాలుగు వారంలోకి ప్రవేశించే నాటికి సినిమా టోటల్ కలెక్షన్ రూ. 198.30 కోట్లు సాధించగా.....బర్ఫీ చిత్రం రిలీజ్ కు రెడీ కావడంతో 'ఏక్ థా టైగర్' చిత్రం చాలా థియేటర్లలో తీసేసారు. దీంతో 5వ వారంలో సల్మాన్ ఖాన్ చిత్రం కేవలం 80 లక్షల నెట్ కలెక్షన్ మాత్రమే సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్ రిపోర్టు ప్రకారం ఈచిత్రం తాజాగా 5 వారాలు పూర్తి చేసుకుని రూ. 199.10 కోట్ల కలెక్షన్ రాబట్టింది.
తొలి నాళ్లలో ఈ సినిమా కేవలం సల్మాన్ ఖాన్ స్టార్ ఇమేజ్ పైనే ఆడింది. సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం బిజినెస్ క్రమ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈచిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని రూపొందించగా సల్మాన్-కత్రినా జంటగా నటించారు.


Click it and Unblock the Notifications











