సల్మాన్ తెలుగు 'రెడీ' రీమేక్ కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి?
సల్మాన్ ఖాన్, అసిన్ కాంబినేషన్ లో తెలుగులో హిట్ అయిన రెడీ చిత్రాన్ని అదే టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. క్రిందటి శుక్రవారం విడుదలైన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఓ రేంజి కలెక్షన్స్ తెచ్చి ట్రేడ్ పండితులను షాక్ చేసింది. ఇప్పటివరకూ దాదాపు నలభై ఒక్క కోట్లు వసూలు చేసినట్లు చెప్తున్నారు. అయితే దబాంగ్ అంత హిట్టు మాత్రం కాదని అంటున్నారు. తెలుగులో రెడీ చిత్రం చూసిన వారు మాత్రం హిందీలో కీలకమైన బ్రహ్మానందం ఎపిసోడ్ పేలలేదంటున్నారు.పరేష్ రావెల్ చేసిన కామిడీ జనాలకి అంత కిక్కవట లేదని చెప్తున్నారు. అయితే రింగ..రింగ పాటను అనుకరిస్తూ చేసిన సాంగ్ మాత్రం జనాలని ధియోటర్స్ లో లేచి నిలబడి డాన్స్ లు చేసేలా చేస్తోంది. 1,900 స్క్రీన్స్ లో విడుదలైన ఈ చిత్రం మొదటిరోజు పదమూడు కోట్ల యాభై లక్షలు వసూలు చేసింది. అలాగే శనివారం రోజు పన్నెండున్నర కోట్లు, ఆదివారం పదిహేను కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసిందని బాలీవుడ్ ట్రేడ్ టాక్.


Click it and Unblock the Notifications











