30 ఏళ్ల తర్వాత మళ్లీ సల్మాన్, షారుక్ ఖాన్.. బాక్సాఫీస్ చరిత్ర మళ్లీ తిరగరాస్తారా?
దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్, కల్ట్ క్లాసిక్ చిత్రాలను ఈతరం జనరేషన్‌కు అందించాలనే ఉద్దేశంతో అలాంటి మూవీస్ రీరీలీజ్ ట్రెండ్ కొనసాగుతూ ఉంది. పలు హీరోల సినిమాల రీరిలీజ్ అయి భారీ కలెక్షన్లు సాధిస్తున్నాయి. తెలుగులో ఈ ట్రెండ్ భారీగా కొనసాగుతుండగా.. ఈ క్రేజ్ హిందీ సినిమా రంగానికి పాకింది. ఇటీవల కొన్ని చిత్రాలు రీ రిలీజై రికార్డు వసూల్లు సాధించాయి. అయితే ఈ సందర్భంగా షారుక్, సల్మాన్ నటించిన కరణ్ అర్జున్ చిత్రం రి రీలీజ్‌కు రెడీ అవుతున్నది. ఆ వివారాల్లోకి వెళితే..
హిందీలో కొన్ని సినిమాలు ఇటీవల మళ్లీ విడుదలై భారీ విజయాలను అందుకొంటున్నాయి. ఇటీవల తుంబాడ్ చిత్రం రీ రిలీజై రికార్డు కలెక్షన్లు రాబట్టింది. తుంబాడ్ చిత్రం నాలుగు వారాలుపాటు దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సుమారుగా 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తన లైఫ్ టైమ్ కలెక్షన్లను 42.5 కోట్లకు పెంచుకొన్నది. ఈ సినిమా స్పూర్తితో కరణ్ అర్జున్ సినిమాను కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

కరణ్ అర్జున్ సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ జంటగా అలనాటి స్టార్ హీరోయిన్ రాఖీ తల్లి పాత్రలో, సుప్రసిద్ద నటుడు అమ్రీష్ పురి విలన్ పాత్రలో, మమతా కులకర్ణి, కాజోల్ హీరోయిన్లుగా నటించారు. నటుడు, దర్శకుడు, నిర్మాత రాకేష్ రోషన్ నిర్మించి దర్శకత్వం వహించారు.
పునర్జన్మ కథాంశంతో 1995 విడుదలైన రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సుమారుగా 6 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమా తొలి ఆట నుంచి బ్లాక్‌బస్టర్ టాక్ అందుకోవడంతో తొలి రోజు నుంచే కాసుల పంట పండించింది. ఈ సినిమా 43 కోట్ల రూపాయాలు వసూలు చేసి అప్పట్లో తన లైఫ్ టైమ్ బాక్సాఫీస్ కలెక్షన్లతో రికార్డు క్రియేట్ చేసింది.

అలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మళ్లీ మరోసారి 30 ఏళ్ల తర్వాత ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. షారుక్, సల్మాన్ ఖాన్ తొలిసారి కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో సుమారుగా 75 వారాలపాటు థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలోని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. షారుక్, సల్మాన్ కెమిస్ట్రీ తెర మీద అద్బుతాన్ని ఆవిష్కరించింది.
బాలీవుడ్‌లో ఇండస్ట్రీలో ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం కరణ్ అర్జున్ సినిమాను నవంబర్ 22వ తేదీన రిలీజ్ చేస్తున్నట్ట సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలిసింది. ఈ సినిమా కోసం హిందీ ప్రేక్షకులే కాకుండా దక్షిణాది ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీ రిలీజ్‌లో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











