»   » ఈ సినీ స్టార్స్ టాక్సే కోట్లలో చెల్లించారు..(టాప్ 10 లిస్ట్)

ఈ సినీ స్టార్స్ టాక్సే కోట్లలో చెల్లించారు..(టాప్ 10 లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: 2016-17 వార్షిక సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన ప్రముఖల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. సినీ స్టార్ల విషయం పరిశీలిస్తే బాలీవుడ్ నుండి అత్యధికంగా టాక్స్ చెల్లించి మొదటి స్థానంలో నిలిచాడు సల్మాన్ ఖాన్.

2016-17 వార్షిక సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్స్ రూ.44.5కోట్లు చెల్లించారు సల్మాన్ ఖాన్. కేవలం టాక్సే ఇన్ని కోట్లు చెల్లించాడంటే.... వీరి సంపాదన ఎన్ని కోట్లు ఉంటుందో అంటూ సినీ ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ సంపాదన రూ. 200 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.

బాలీవుడ్లో భారీగా అడ్వాన్డ్స్ టాక్స్ చెల్లించిన టాప్ 10 స్టార్ల వివరాలు క్రింది విధంగా....

 నెం.1 సల్మాన్ ఖాన్

నెం.1 సల్మాన్ ఖాన్

2016-17 వార్షిక సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్స్ రూ.44.5కోట్లు చెల్లించారు సల్మాన్ ఖాన్. సినీ సెలబ్రిటీ సర్కిల్ లో అత్యధికంగా టాక్స్ చెల్లించింది సల్మాన్ ఖానే.

రెండో స్థానంలో అక్షయ్ కుమార్

రెండో స్థానంలో అక్షయ్ కుమార్

మరో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ రూ.29.5 కోట్ల టాక్స్ చెల్లించి రెండో స్థానం దక్కించుకున్నాడు. అక్షయ్ కుమార్ సినిమాలతో పాటు పలు వ్యాపారాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మూడో స్థానంలో హృతిక్

మూడో స్థానంలో హృతిక్

హృతిక్ రోషన్ టాక్స్ రూపంలో రూ.25.5 కోట్లు చెల్లించాడు. మరి టాక్స్ ఇంత చెల్లించాడంటే అతడిగాడి సంపాదన ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

టీవీ యాంకర్ కూడా

టీవీ యాంకర్ కూడా

బుల్లితెరపై కపిల్ శర్మ కామెడీ షోకు ఎంత డిమాండ్ ఉంతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీవీ షోలతోనే కోట్లు సంపాదిస్తున్నాడు. ఇతగాడు టాక్స్ రూపంలో రూ.23.9 కోట్లు చెల్లించాడు.

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్

రణ్ బీర్ కపూర్ టాక్స్ రూపంలో రూ.16.5కోట్లు చెల్లించారు. గతేడాది రణబీర్ కపూర్ యే దిల్ హై ముష్కిల్ సినిమాకు బారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. దీంతో పాటు ప్రస్తుతం చేస్తున్న జగ్గా జాసూస్ సినిమాకు కూడా ముందుగానే అడ్వాన్స్ కోట్లలో తీసుకున్నాడు.

అమీర్ ఖాన్

అమీర్ ఖాన్

మిస్టర్ పర్‌ఫెక్షనిస్టు అమీర్ ఖాన్ రూ.14.8కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ ను చెల్లించారు. గత సంవత్సరం అమీర్ ఖాన్ రూ.9.6 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు. అంటే ఈ సారి సంపాదన బాగా పెరిగిందన్నమాట.

కరణ్ జోహార్

కరణ్ జోహార్

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ సారి రూ. 11.7 కోట్ల టాక్స్ చెల్లించారు.

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్

హీరోయిన్ల విషయానికి వస్తే టాప్ హీరోయిన్ దీపికా పదుకొణెరూ.10.25 కోట్లు చెల్లించారు.... అమ్మడు బాలీవుడ్ చిత్రాలతో పాటు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి బాగానే సంపాదిస్తోంది.

 అలియాభట్

అలియాభట్

కుర్ర హీరోయిన్ అలియా భట్ కూడా రూ.4.33 కోట్ల టాక్స్ చెల్లించింది. వరుస సినిమాలతో దూసుకెలుతున్న ఈ కుర్రబ్యూటీ సంపాదన కూడా బాగానే ఉందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.

కరీనా కపూర్

కరీనా కపూర్

కరీనాకపూర్ రూ.3.9కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారు. గత సంవత్సరంలో ఇదే కరీనాకపూర్ రూ.7కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు. గర్భవతి కావటంతో కరీనా సినిమాలకు దూరంగా ఉండటంతో ఆమె సంపాదన తగ్గింది.

English summary
Salman Khan has paid the highest advance tax for the financial year 2016-17, according to reports. Salman beat out the likes of Aamir Khan , Akshay Kumar and Hrithik Roshan with his tax returns.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu