twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కెరీర్‌లో మొదటిసారి భారీ డిజాస్టర్‌ను చూసిన సల్మాన్ ఖాన్.. 'రాధే' రెండో దెబ్బ

    |

    బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎలాంటి సినిమాతో వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ ఓపెనింగ్స్ తోనే సినిమాకు లాభాలు అందిస్తూ ఉంటాడు. ఆయన ప్లాప్ సినిమాలు కూడా నిర్మాతలను ఎంతో కొంత సేవ్ చేసినవే. ఇక ఇటీవల వచ్చిన రాధే సినిమా మాత్రం ఊహించని రేంజ్ లో డిజాస్టర్ అయ్యింది. నిర్మాతలు సేఫ్ అయ్యారు గాని దాన్ని నమ్ముకొని బిజినెస్ చేసిన వారికి మాత్రం భారీ దెబ్బ పడింది. రీసెంట్ గా థియేటర్స్ లో కూడా రిలీజ్ చేయగా అక్కడ కలెక్షన్స్ కూడా దారుణంగా వచ్చాయి.

    ఏదో ఒక రికార్డ్ తో

    ఏదో ఒక రికార్డ్ తో

    సల్మాన్ ఖాన్ కు స్టార్ డమ్ వచ్చిన తరువాత కమర్షియల్ గానే బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ఖాన్ త్రయంలో ప్రతిసారి కూడా సల్మాన్ ఖాన్ ఏదో ఒక రికార్డ్ తో మిగతా వారికి చాలెంజ్ విసురుతూ వచ్చాడు. ఇక 2020 నుంచి మరింత స్పీడ్ పెంచాలని అనుకోగా కరోనా వలన వెండితెరకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.

    మొదట థియేటర్స్ లో విడుదల చేయాలని

    మొదట థియేటర్స్ లో విడుదల చేయాలని

    సల్మాన్ ఖాన్ ఇటీవల రాధే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మొదట థియేటర్స్ లో విడుదల చేయాలని చాలా రోజులు ఎదురుచూశారు. కానీ కరోనా తగ్గకపోవడంతో ఆలస్యం చేయలేక డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేశారు.

    విడుదలైన మొదటి రోజే

    విడుదలైన మొదటి రోజే

    జీ సంస్థ దాదాపు 250కోట్లకు పైగా ఖర్చు చేసి రాధే ఓటీటీ హక్కులను దక్కించుకుంది. సినిమాను 170కోట్ల బడ్జెట్ తో నిర్మించడంతో ఓటీటీ రైట్స్ ద్వారా దాదాపు 80కోట్ల వరకు లాభం వచ్చింది. ఇక జీ సంస్థ ఓటీటీలో రూ.249 పర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేయగా అక్కడ ఏ మాత్రం లాభాలు రాలేదు. సినిమా విడుదలైన మొదటి రోజే సినిమా డిజాస్టర్ టాక్ ను అందుకుంది.

    తక్కువ కలెక్షన్స్ రావడంతో

    తక్కువ కలెక్షన్స్ రావడంతో

    రాధే సినిమాను థియేట్రికల్ గా విడుదల చేసి ఉంటే మరో రేంజ్ లో ప్లాప్ అయ్యేదని కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక ఇటీవల నార్త్ లో కొన్ని చోట్ల 50% ఆక్యుపెన్సీ తో థియేటర్స్ ఓపెన్ కావడంతో రాధేను కూడా రిలీజ్ చేశారట. అయితే సినిమాకు కనీసం ఒక 10వేలు కూడా రాలేదట. ఒక రెండు థియేటర్లు అయితే ఖాళీగా కనిపించాయట. డిజాస్టర్ అని తెలిసినా కూడా మళ్లీ భారీగా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని ఆ కలెక్షన్స్ తో ఒక క్లారిటీ అయితే వచ్చినట్లు సమాచారం.

    English summary
    Salman Khan is one of the highest marketed heroes in the Bollywood industry. Bhai, who receives minimum box office hits as a commercial, is facing unexpected criticism with Radhe this time. The heroism elevations that were once in the South are now being used and trolled in Orange. Netizens are trending some hashtags for a variety of reasons, including that Radhe should boycott the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X