Kisi Ka Bhai Kisi Ki Jaan collections సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే షాకింగ్ కలెక్షన్లు.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్లను నమోదు చేసింది. రంజాన్ పండగ కానుకగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోవడంతో కలెక్షన్ల పరంగా చతికిలపడింది. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ఎన్నడూ ఊహించని విధంగా బాక్సాఫీస్ రిపోర్టు ఉండటం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేసింది. సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా విషయానికి వస్తే.. తమిళంలో భారీ విజయం అందుకొన్న వీరమ్ (తెలుగులో కాటమరాయుడు) సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, జగపతి బాబు, బాక్సింగ్ క్రీడాకారుడు విజేందర్ సింగ్, పూజా హెగ్డే, షెహనాజ్ గిల్, పలక్ తివారీ తదితరులు నటించారు.

కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా విడుదలకు ముందు బ్యాడ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దాంతో ఊహించని విధంగా సోషల్ మీడియాలో ప్రతికూలమైన కామెంట్లు వినిపించాయి. ఆ ప్రతికూల కామెంట్లను అధిగమించే ప్రయత్నం ఈ సినిమా విషయంలో కనిపించలేదు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సల్మాన్ ఖాన్ సినిమాకు రిలీజ్ అవుతుందంటే అడ్వాన్స్ బుకింగ్ భారీగా కనిపిస్తుంటుంది. కానీ
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా విషయంలో అది కనిపించలేదు. పేలవంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఉండటంతో ప్రేక్షకులకు పెద్దగా క్యూరియాసిటీ ఈ చిత్రంపై కనిపించలేదనేది స్పష్టమైంది. దాంతో తొలి రోజు ఈ సినిమా కలెక్షన్లు సల్మాన్ ఖాన్ స్టార్ డమ్‌కు తగినట్టుగా నమోదు కాలేదని తాజా రిపోర్టు తెలియజేసింది.

కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రాన్ని భారీగా దాదాపు 100 దేశాల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 5700 స్క్రీన్లలో ప్రదర్శించారు. ఇటీవల కాలంలో పఠాన్ తర్వాత ఆ రేంజ్‌లో విడుదలైన సినిమా ఇదే కావడం గమనార్హం. కానీ ఈ సినిమాకు మినిమమ్ కూడా బజ్ క్రియేట్ కాకపోవడం ట్రేడ్ వర్గాల్లో ఆశ్చర్యానికి గురిచేసింది.
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియాలోనే ఓ రేంజ్ కలెక్షన్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమాకు పెద్దగా స్పందన కనిపించలేదు. తాజా వివరాల ప్రకారం. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రం ఇండియాలో 12.5 కోట్లు వసూలు చేయగా... ప్రపంచవ్యాప్తంగా 15.8 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు రిపోర్టు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











