Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆయనతో ఆయనకే పోటీ.. ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డులు.. దటీజ్ సల్మాన్
గత దశాబ్ద కాలంగా సల్మాన్ ఖాన్‌కు, ఆయన సినిమాలకు ఎదురు లేకుండా పోతోంది. ఆయన వస్తున్నాడంటే.. మిగతా హీరోలంతా పక్కకు జరగాల్సిందే. బాలీవుడ్లో వంద కోట్లు కొల్లగొట్టడానికి కిందామీదా పడే హీరోలున్నా.. సల్మాన్ మంచినీళ్ల ప్రాయంగా వసూళు చేసేస్తాడు. సల్మాన్ కనబడితే చాలు కాసుల వర్షమే అనేట్టు మారింది పరిస్థితి. కథ, కథనాలు గాలికొదిలేసిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించడం సల్మాన్‌కే చెందింది.
|
గత దశాబ్దం పాటుగా..
2010 నుంచి సల్మాన్ ఖాన్ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. వాటిని మళ్లీ సల్మానే తిరిగరాస్తున్నాడు. దాదాపు పదేళ్ల పాటు ఇలా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తోన్న మరో హీరో లేకపోవడం విశేషం. అందుకే బాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు.
|
2010 నుంచి రికార్డులు..
ఫస్ట్ డే కలెక్షన్లలో సల్మాన్ తన రికార్డులను తానే రీ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఓ సారి ఆ లెక్కలేంటో చూద్దాం. 2010లో వీర్ చిత్రం ఏడు కోట్లు, దబంగ్ 14.50కోట్లు.. 2011లో రెడీ 13.15, బాడీగార్డ్ 21.60.. 2012లో ఏక్తా టైగర్ 32.93, దబంగ్2 21.10.. 2013లో జయహో 17.75కోట్లు.. 2014లో కిక్ 26.40 కోట్లను కొల్లగొట్టాయి.
2015 నుంచి అదే పరంపర..
ఇలా రికార్డులను క్రియేట్ చేయడంలో అదే పరంపరను కొనసాగిస్తూ వస్తున్నాడు. 2015లో వచ్చిన భజరంగీ భాయీజాన్ 27.25కోట్లు, ప్రేమ్ రతన్ ధన్ పాయో 40.35.. 2016లో సుల్తాన్ 36.54.. 2017లో ట్యూబ్ లైట్ 21.15, టైగర్ జిందాహై 34.10.. 2018లో రేస్3 29.17కోట్లు, 2019లో భారత్ 42.30కోట్లను కొల్లగొట్టాయి.
అంచనాలు తప్పినా..
దబంగ్ 3పై ట్రేడ్ పండితుల అంచనాలు తప్పినా.. ఫస్ట్ డే రోజు దుమ్ములేపే కలెక్షన్లను కొల్లగొట్టాడు. దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులు దబంగ్3పై ప్రభావం చూపాయి. అయినా కానీ ఈ చిత్రం మొదటి రోజు 24.50కోట్లు కొల్లగొట్టినట్టి ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.