Radhe day 1 collections: బాక్సాఫీస్ వద్ద సల్మాన్ ఖాన్ పోరాటం.. ఇలా అయితే కష్టమే
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చాలా కాలం తరువాత రాధే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. థియేటర్లలో కాకుండా కేవలం ఓటీటీ ద్వారా ఇండియన్ అడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక ఓవర్సీస్ లో మాత్రం సినిమా థియేట్రికల్ గానే విడుదల అయ్యింది. ఓవర్సీస్ లో సల్మాన్ సినిమాలకు కలెక్షన్స్ బాగానే వస్తుంటాయి. ఇక రాధే మాత్రం మొదటి రోజు అనుకున్నంత స్థాయిలో ఏమి రాబట్టలేకపోయింది.

డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్
ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్స్ మూత పడిన విషయం తెలిసిందే. చరిత్రలోనే ఎన్నాడు లేని విదంగా తీవ్ర స్థాయిలో థియేటర్స్ ఆదాయం లేకుండా ఉన్నాయి. ఇక రాధే సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైంది. థియేట్రికల్ గా రిలీజ్ అయ్యి ఉంటే ఈ ఫెస్టివల్ సీజన్ లో సినిమా సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసేది.

ఆస్ట్రేలియా కలెక్షన్స్
అసలు మ్యాటర్ లోకి వెళితే.. సినిమాకు సంబంధించిన మొదటి రోజు కలెక్షన్స్ లిస్ట్ కొంత బయటకు వచ్చింది. ఓవర్సీస్ లో సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకోలేదు. ఆస్ట్రేలియాలో బాలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఇక అక్కడ సల్మాన్ రాధే సినిమా 62, 988 డాలర్లను రాబట్టింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 35.71లక్షలు.

న్యూజిలాండ్ కలెక్షన్స్
ఇక న్యూజిలాండ్ లో కేవలం 19లొకేషన్స్ లలో రిలీజ్ అవ్వగా కేవలం 11.199 డాలర్లను మాత్రమే రాబట్టింది. అనే మన కరెన్సీనల్లో 5.90లక్షల రూపాయలు. ఇక యుఎస్ లో కూడా రాధే మూవీ పరవాలేదు అనే విధంగా ఓపెనింగ్స్ అందుకున్నట్లు సమాచారం. ఒక విధంగా సల్మాన్ కెరీర్ లో ఇదే అత్యంత తక్కువ కలెక్షన్స్ అందించిన సినిమా.
Recommended Video

ఫ్రీగానే చూసేస్తున్నారు
ఇక యూఎస్ కలెక్షన్స్ తో పాటు మిగతా దేశాల కలెక్షన్స్ లిస్ట్ రావాల్సి ఉంది. రాధే సినిమాను అసలైతే థియేటర్స్ ఓపెన్ అయిన తరువాతే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి ఇప్పట్లో పరిస్థితులు అదుపులోకి రావని చిత్ర యూనిట్ ముందే గ్రహించింది. ఇక జీ ఫ్లెక్స్ కు లాభదాయకంగానే అమ్మేసింది.
అందులో పే పర్ వ్యూ ఫార్మాట్ లో 249రూపాయలు ఫిక్స్ చేశారు. కానీ విడుదలైన కొన్ని గంటలకే సినిమా పైరసీ ద్వారా మొత్తం లీక్ అయ్యింది. చాలామంది సినిమాను ఫ్రీగానే చూసేస్తున్నట్లు సమాచారం. ఇలా పైరసీ దెబ్బ కొడితే సినిమాలు ఆడటం కష్టమే అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











