భారత్ డబుల్ సెంచరీ.. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో మరో రికార్డు
బాలీవుడ్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన భారత్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో రికార్డు సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం విడుదల నాటి నుంచి 14 రోజున రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. సల్మాన్ కెరీర్‌లో రూ.200 క్లబ్‌లో చేరిన సినిమా ఇది ఆరోవది కావడం విశేషం. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

రంజాన్ సెంటిమెంట్‌తో
రంజాన్ కానుకగా భారత్ చిత్రం దేశవ్యాప్తంగా 4700 థియేటర్లలో విడుదలైంది. ఉత్తరాదిలోనే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఈ ఏడాది యూరీ తర్వాత భారీ వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా భారత్ నిలిచింది. రెండో వారం ముగియస్తున్న నేపథ్యంలో ఉత్తరాదిలో ఈ సినిమాకు ఇంకా మంచి ప్రజాదరణ కనిపిస్తున్నది.
200 క్లబ్‌లోకి ఇలా చేరి..
భారత్ వసూళ్ల గురించి ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద భారత్ స్కోర్ డబుల్ సెంచరీ కొట్టింది. ఈ చిత్రం 200 కోట్ల మార్కు దాటింది. ఉత్తరాదిలో బ్రహ్మండంగా ఉంది. మిగితా ప్రాంతాల్లో వసూళ్లు క్షీణించింది. శుక్రవారం రూ.4.30 కోట్లు, శనివారం రూ.6.37 కోట్లు, ఆదివారం రూ.6.19 కోట్లు, సోమవారం రూ.2.63 కోట్లు, మంగళవారం రూ.2.32 కోట్లు సాధించింది. దాంతో ఈ చిత్రం రూ.201.86 కోట్లు వసూలు చేసింది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

రికార్డుపై సల్మాన్ ఖాన్ ట్వీట్
భారత్ చిత్రం రూ.200 క్లబ్‌లో చేరడంపై సల్మాన్ ఖాన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశంపై ట్విట్టర్‌లో స్పందిస్తూ.. చిత్ర విజయంలో పాలుపంచుకొన్న ప్రతీఒక్కరికి థ్యాంక్స్. ఇలాంటి రియాక్షన్ చాలా అరుదుగా వస్తుంది. చాలా తక్కువ సినిమాలకు ఇలాంటి స్పందన దక్కుతుంది. అలాంటి గౌరవం భారత్‌కు దక్కింది అంటూ సల్మాన్ ట్వీట్ చేశారు.

సల్మాన్ ఖాన్ ఎమోషనల్
ఏ సినిమా అయితే నాకు బాగా అనిపిస్తుందో.. అది మీకు నచ్చుతుందని నేను చెప్పగలను. ప్రతీసారి ఇది నిజమని రుజువు చేశారు. నేను ఏ సినిమాలో నటించిన అదీ మీకు నచ్చడం నాకు ఆనందంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరు ఈ సినిమాను విజయం వైపు నడిపించారు. అందుకు ప్రతీఒక్కరికి ధన్యవాదాలు. భారత్ సినిమాను ఆదరించింనందుకు థ్యాంక్స్ అని సల్మాన్ పేర్కొన్నారు.

కామన్ మ్యాన్ బయోపిక్‌గా
కొరియాలో ఘనవిజయం సాధించిన ఆడ్ టూ మై ఫాదర్ అనే చిత్రం ఆధారంగా భారత్ రూపొందింది. ఇది ఓ కామన్ మ్యాన్ బయోపిక్ మాదిరిగా తెరకెక్కించారు. సల్మాన్ ఖాన్ 70 ఏళ్ల ముసలివాడిగా కనిపించడం గమనార్హం. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, సునీల్ గ్రోవర్, దిశా పటానీ, టబు తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











