twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ వైపు రూ. 100 కోట్లు, మరో వైపు రెస్పెక్ట్... భావోద్వేగానికి గురైన సల్మాన్ ఖాన్!

    |

    బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి తాను బాక్సాఫీస్ సుల్తాన్ అని నిరూపించాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'భారత్' బంపర్ ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తోంది. ఐసిసి వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో టీమిండియా మొదటి మ్యాచ్ జరిగే రోజు విడుదలైనప్పటికీ మొదటి రోజు రూ. 42.30 కోట్లు రాబట్టింది.

    ఇంతకు సల్మాన్ ఖాన్ కెరీర్లో సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' ఓపెనింగ్స్(రూ. 40.35 కోట్లు) పరంగా టాప్ పొజిషన్లో ఉండేది. 'భారత్' ఆ రికార్డులను బద్దలు కొట్టింది. రెండో రోజైన గురువారం రూ. 31 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం రూ. 28 కోట్ల వసూలు చేసినట్లు అంచనా. దీంతో టోటల్ వసూళ్లు రూ. 100 కోట్లు రీచ్ అయింది.

    సల్మాన్ ఖాన్ భావోద్వేగం

    సల్మాన్ ఖాన్ భావోద్వేగం

    ‘భారత్' చిత్రం ఇండియా వ్యాప్తంగా 4,700 థియేటర్లలో విడుదలైంది. విడుదలైన అన్ని ఏరియాల్లో... ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. వసూళ్లు అద్భుతంగా ఉండటంతో సల్మాన్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో ట్వీట్ చేశాడు.

    ఆ మూమెంట్ చూసి గర్వపడ్డాను: సల్మాన్ ఖాన్

    ఆ మూమెంట్ చూసి గర్వపడ్డాను: సల్మాన్ ఖాన్

    నా కెరీర్లో ఇంత పెద్ద ఓపెనింగ్స్ ఇచ్చిన పత్రి ఒక్కరికీ థాంక్స్. నా సినిమాలో జాతీయ గీతం వస్తుంటే ప్రతి ఒక్కరూ నిలబడి సెల్యూట్ చేశారు. ఇది నాకు హ్యాపీయెస్ట్ అండ్ ప్రౌడెస్ట్ మూమెంట్. మన దేశానికి మనం ఇచ్చే గౌరవానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది అంటూ సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు.

    క్రిటిక్స్ రేటింగ్ సైతం అదిరిపోయింది

    క్రిటిక్స్ రేటింగ్ సైతం అదిరిపోయింది

    ‘భారత్' చిత్రానికి కేవలం ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం మాత్రమే కాదు... క్రిటిక్స్ నుంచి సైతం మంచి రేటింగ్స్ వచ్చాయి. దీంతో సినిమాపై పాజిటివ్ బజ్ మరింత పెరిగింది. రంజాన్ హాలిడే, వీకెండ్ వెరసి ‘భారత్' మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది.

    భారత్

    భారత్

    అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. కత్రినా కైఫ్, దిశా పటానీ, సునీల్ గ్రోవర్, నోరా పతేహి, జాకీ ష్రాఫ్, సోనాలి కులకర్ణి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా ఒక సాధారణ వ్యక్తి జీవిత కోణంలో ఇండియా హిస్టరీని చూపించే ప్రయత్నం చేశారు.

    English summary
    Salman Khan has proved yet again that he is the 'Sultan' of the box office. According to early estimates, it crossed the Rs 100-crore milestone on Friday. Salman Khan wrote, "Big thank you sabko for giving sabse bada opening mere career ka par what made me the happiest and proudest is ki during a scene in my film jab national anthem is recited everyone stood up as a mark of respect. There could be no bigger respect for our country than this... Jai Hind."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X