భారత్ మూవీ రెండో రోజు ఎంత రాబట్టిందంటే..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సుమారు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది భారత్ మూవీ. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా రంజాన్ కానుకగా జూన్ 5వ తేదీన విడుదలైంది. ఫస్ట్ షో నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు 42.3 కోట్ల కలెక్షన్స్ సాధించగా.. రెండో రోజు (గురువారం) మరో 30 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లో ఈ సినిమా 72 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
2019 సంవత్సరంలో.. మొదటి రోజే అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో చిత్రంగా, అదేవిధంగా బాలీవుడ్ చరిత్రలో మొదటి రోజే అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాలుగో చిత్రంగా 'భారత్' మూవీ రికార్డు సృష్టించింది. ఇక సల్మాన్ కెరీర్ పరంగా అయితే తొలిరోజు అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా 'భారత్' సినిమానే నిలవడం విశేషం. ఈ మేరకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు సల్మాన్. ఇప్పటికే కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఈ వారాంతంలో పుంజుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాని తీసుకున్నారు. కానీ ఆమె తన పెళ్లి కారణంగా సినిమా నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో కత్రినా కైఫ్ వచ్చింది. ప్రియాంక చోప్రానే హీరోయిన్ కావాలని సల్మాన్ పట్టుబట్టినా చివరకు ఆమె మాత్రం ఒప్పుకోకపోవడంతో కత్రినాను ఫైనల్ చేశారు మేకర్స్. కాగా కత్రినా- సల్మాన్ జోడీ అభినయం, దిశా పటాని అందాలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











