150 కోట్ల క్లబ్‌లో చేరిన భారత్.. వీకెండ్ బెటర్ కలెక్షన్స్
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా సుమారు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది భారత్ మూవీ. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా రంజాన్ కానుకగా జూన్ 5వ తేదీన విడుదలైంది. విడుదలైన మొదలై రోజే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి వారాంతానికే 150 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ విషయాన్ని పేర్కొంటూ సినీ విశ్లేషకుడు తరం ఆదర్శ్ తాజాగా ట్వీట్ పెట్టారు.
మొదటి రోజు 42.3 కోట్ల కలెక్షన్స్ సాధించగా.. రెండో రోజు మరో 30 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది భారత్ సినిమా. ఆ తర్వాత వీకెండ్ కావడంతో కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. శుక్రవారం 22.20 కోట్లు, శనివారం 26.70 కోట్లు అదేవిధంగా ఆదివారం రోజు 29.70 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా చూస్తే మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమా 150 కోట్ల రూపాయలను దాటేయడం విశేషం.

సూపర్ హిట్ సినిమాగా దూసుకుపోవడమే గాక కలెక్షన్స్ పరంగా కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది భారత్ మూవీ. 2019 సంవత్సరంలో.. మొదటి రోజే అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో చిత్రంగా, అదేవిధంగా బాలీవుడ్ చరిత్రలో మొదటి రోజే అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాలుగో చిత్రంగా 'భారత్' మూవీ రికార్డు సృష్టించింది. ఇక సల్మాన్ కెరీర్ పరంగా అయితే తొలిరోజు అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా 'భారత్' సినిమానే తన పేరును లిఖించుకోవడం విశేషం.
మొదట భారత్ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాని తీసుకోవడం జరిగింది. కానీ ఆమె తన పెళ్లి కారణంగా తప్పుకోవడంతో ఆ స్థానంలో కత్రినా కైఫ్ ను తీసుకున్నారు. దిశా పటాని మరో హీరోయిన్‌గా నటించింది. కత్రినా- సల్మాన్ జోడీ అభినయం, దిశా పటాని అందాలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఈ వారంలో కూడా భారత్ కలెక్షన్ల వరద పారుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.


Click it and Unblock the Notifications











