'దబంగ్‌ 3' కలెక్షన్స్ రిపోర్ట్: CAA ఎఫెక్ట్! వారాంతంలో వసూళ్లు చూస్తే..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తాజా చిత్రం 'దబంగ్‌ 3'. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్ సరసన బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించింది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20 తేదీన విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటూ ముందుకెళ్తోంది. తొలి వారాంతం ముగిసేసరికి 'దబంగ్‌ 3' కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దామా..

తొలి వారాంతం.. మొత్తంగా అన్ని భాషల్లో కలిపి

తొలి వారాంతం.. మొత్తంగా అన్ని భాషల్లో కలిపి

తొలి వారాంతంలో దేశవ్యాప్తంగా చూస్తే 'దబంగ్‌ 3' సినిమా 81.15 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేశారు. ఓపెనింగ్ రోజైన శుక్రవారం 24.50 కోట్లు, శనివారం 24.75 కోట్లు, ఆదివారం 31.90 కోట్లు రాబట్టిన ఈ సినిమాగా మొత్తంగా అన్ని భాషల్లో కలిపి 81.15 కోట్లు సాధించినట్లు ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ చెబుతున్నాయి.

CAA ఎఫెక్ట్.. రిపోర్ట్స్ చూస్తుంటే..

CAA ఎఫెక్ట్.. రిపోర్ట్స్ చూస్తుంటే..

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు (CAA) వ్యతిరేకంగా కొన్నివర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఉత్తరాదిలో నిరసనలు అధికంగా ఉండటంతో.. ఆ ప్రభావం 'దబంగ్‌ 3' సినిమాపై పడి.. వసూళ్లు తగ్గే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ రిపోర్ట్స్ చూస్తుంటే ఆ ఆందోళనలు కలెక్షన్స్‌పై ప్రభావం చూపలేదని స్పష్టమవుతోంది.

ఆ ఇద్దరు హీరోల కంటే టాప్..

ఆ ఇద్దరు హీరోల కంటే టాప్..

గతంలో బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్ హీరోగా వచ్చిన 'కబీర్ సింగ్' సినిమా వారాంతంలో 70.67 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన 'మిషన్ మంగళ్' సినిమా వారాంతం ముగిసే సరికి 67.39 కోట్లు రాబట్టింది. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ హిట్ సాధించాయి. సో ఈ ఇద్దరు హీరోల కంటే ఇప్పుడు సల్మాన్ మరింత ముందున్నాడు కాబట్టి 'దబంగ్‌ 3' సంగతి అర్థంచేసుకోవచ్చు.

ఓవర్సీస్ మార్కెట్

ఓవర్సీస్ మార్కెట్

పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కారణంగా ఈ ఎఫెక్ట్ 'దబంగ్‌ 3' పడే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో చూస్తే.. ఈ సినిమా 4 మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదే సిరీస్ నుంచి గతంలో వచ్చిన దబాంగ్ 5.6 మిలియన్ల, దబాంగ్ 2 మూవీ 8.47 మిలియన్ల వీకెండ్ కలెక్షన్స్ నమోదు చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X