Kisi Ka Bhai Kisi Ki Jaan Collections సల్మాన్ మూవీ కలెక్షన్లు డ్రాప్.. కిసీ కా భాయ్ 5 రోజుల కలెక్షన్లు ఎంతంటే?

Kisi Ka Bhai Kisi Ki Jaan బడ్జెట్ గురించి:సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం భారీ తారాగణంతో తెరకెక్కించారు. తెలుగు చిత్రం కాటమరాయుడు రీమేక్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్, జగపతిబాబు, పూజా హెగ్డే, పలువురు బాలీవుడ్ తారలు నటించారు. దాంతో ఈ సినిమా ఖర్చు భారీగానే అయింది. దాదాపు 100 కోట్ల రూపాయాల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 5 వేలకుపైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Kisi Ka Bhai Kisi Ki Jaan ఆక్యుపెన్సీ :సల్మాన్ ఖాన్ సినిమా రిలీజైందంటే.. థియేటర్లలో సందడి కనిపించేది. కానీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాకు అలాంటి పరిస్థితి కనిపించడం లేదనేది ట్రేడ్ వర్గాల టాక్. ఈ సినిమా 5వ రోజు పేలవమైన ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఈ చిత్రం మార్నింగ్‌ షోకు 7 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 12 శాతం, ఫస్ట్ షోకు 15 శాతం, సెకండ్ షోకు 15 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ చిత్రం 5వ రోజు ఓవరాల్‌గా 11 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

Salman Khans Kisi Ka Bhai Kisi Ki Jaan budget and Day 5 Collections worldwide

Kisi Ka Bhai Kisi Ki Jaan 4 రోజుల కలెక్షన్లు:కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా గత నాలుగు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 15 కోట్ల గ్రాస్, రెండో రోజు 25.75 కోట్ల గ్రాస్, మూడో రోజు 26.61 కోట్ల గ్రాస్, నాలుగో రోజు 10.17 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 78 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

Kisi Ka Bhai Kisi Ki Jaan 5వ రోజు కలెక్షన్లు:కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 7.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. క్రితం రోజుతో పోల్చుకొంటే 27 శాతం వసూళ్లు క్షీణించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Salman Khans Kisi Ka Bhai Kisi Ki Jaan budget and Day 5 Collections worldwide

Kisi Ka Bhai Kisi Ki Jaan టోటల్ కలెక్షన్లు:ఇక కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియాలో 94 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో 33 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం సుమారు 130 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రానున్న రోజుల్లో కలెక్షన్లు పెరిగితే తప్పా ఈ సినిమా లాభాల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదనే టాక్ వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X