Kisi Ka Bhai Kisi Ki Jaan collections: 2వ రోజు ఊహించని కలెక్షన్స్.. ఒక్కసారిగా భాయ్ దూకుడు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ కిసికా భాయ్ కిసిక జాన్ చిత్రం భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది రంజాన్ పండుగ సందర్భంగా ఏదో ఒక చిత్రాన్ని విడుదల చేస్తూ వస్తున్న సల్మాన్ ఖాన్ ఈసారి ఈ సినిమాతో ఇలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని సిద్ధమయ్యాడు. సౌత్ కూడా మంచి క్రేజ్ అందుకోవాలి అని విక్టరీ వెంకటేష్ రామ్ చరణ్ తేజ్ ని సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యేలా చేశాడు. అయితే ఈ సినిమాకు మొదటి రోజు దారుణమైన కలెక్షన్స్ రాగా రెండో రోజు మాత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద నెంబర్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. మొత్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళ్తే..
టాలీవుడ్ స్టార్స్ స్పెషల్:ఏడెళ్ళ క్రితం వచ్చిన తమిళ సినిమా వీరం తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడుగా రీమేక్ అయిన విషయం తెలిసిందే. ఇక అదే సినిమా కథను కాస్త మార్చేసిన సల్మాన్ ఖాన్ రొటీన్ కమర్షియల్ దర్శకుడు ఫర్హాద్ దర్శకత్వంలో తెరపైకి తీసుకువచ్చాడు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా విక్టరీ వెంకటేష్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించాడు. ఇక జగపతిబాబు కూడా ఒక స్పెషల్ రోల్ చేయగా.. రామ్ చరణ్ పాటలో కనిపించాడు.

అడ్వాన్స్ బుకింగ్స్ పై ప్రభావం:కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా విడుదలకు ముందు పెద్దగా పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ కాలేదు. రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా అని ట్రైలర్ సాంగ్స్ ద్వారానే క్లారిటీ వచ్చేసింది. దానికి తోడు సల్మాన్ ఖాన్ లాంగ్ హెయిర్ తో కనిపించిన విధానం కూడా ట్రోలింగ్ కు దారి తీసింది. దీంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ పై చాలా ప్రభావం చూపించింది. ఒకప్పుడు మొదటి రోజు అంటే మినిమం 30 కోట్ల నుంచి 50 కోట్ల మధ్యలో ఓపెనింగ్ అందుకునే సల్మాన్ ఖాన్ ఇప్పుడు కనీసం మొదటిరోజు 20 కోట్లను కూడా అందుకోలేకపోయాడు.
గ్రాండ్ రిలీజ్:కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు భారీ స్థాయిలో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాను దాదాపు 100కు పైగా దేశంలో విడుదల చేశారు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు అయితే 5700 స్క్రీన్ లలో సినిమాను ప్రదర్శించారు. కానీ సినిమాకు అంతగా పాజిటివ్ టాక్ రాకపోవడంతో దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి.

తక్కువ స్థాయిలో ఒపెనింగ్స్:ఇక మొదటిరోజు కేవలం ప్రపంచవ్యాప్తంగా 15.8 కోట్ల కలెక్షన్స్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ ఇంత స్థాయిలో ఒపెనింగ్స్ ఎప్పుడూ అందుకోలేదు. గత పది ఏళ్లుగా సల్మాన్ ఖాన్ ఏ సినిమా చేసినా మినిమమ్ 25 కోట్లకు పైగానే వచ్చేవి. ఇంత తక్కువగా ఒపెనింగ్స్ అయితే అందుకోలేదు. ఈ సినిమాకు విడుదలకు ముందు పెద్దగా హైప్ లేకపోవడంతో ఓపెనింగ్స్ చాలా తక్కువగా వచ్చాయి.
రెండవ రోజు పెరిగిన కలెక్షన్స్:కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా రెండవ రోజు మాత్రం కలెక్షన్స్ ఊహించని స్థాయిలో అందుకోవడం విశేషం. మొదటి రోజు కేవలం 15 కోట్ల రేంజ్ లో రాగా రెండవ రోజు మాత్రం కేవలం ఇండియాలోనే ఈ సినిమాకు 25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ వచ్చాయి. రెండవ రోజు ఈ స్థాయిలో పెరుగుతుంది అని ఎవరు ఊహించలేదు. నెగిటివ్ టాక్ వచ్చినా కూడా బాయ్ సినిమా ఒక్కసారిగా మార్కెట్లో వ్యాల్యూ పెంచేసుకుంది.

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్:ఇక ఓవర్సీస్ లో దాదాపుగా రెండు రోజుల్లో కలిపి ఈ సినిమాకు 20 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మొదటి రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే ఇండియాలో 38 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే బాయ్ సినిమా దాదాపు 65 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఆదివారం కూడా సినిమాకు కలెక్షన్స్ గట్టిగానే వచ్చే అవకాశం ఉంది. మరి మొత్తంగా ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











