Salman Khan's Radhe Day 2 collections: టాక్ చూస్తే దారుణంగా.. కలెక్షన్లు చూస్తే దిమ్మతిరిగేలా!
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ చిత్రం రంజాన్ కానుకగా మే 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ5 ఓటీటీ యాప్ ద్వారా ఈ చిత్రం పే ఫర్ వ్యూ (డబ్బు చెల్లించి చూసే పద్దతిలో) ద్వారా రిలీజ్ అయింది. అయితే జీ ప్లెక్స్‌లో సల్మాన్ ఖాన్ సినిమాకు రికార్డుస్థాయిలో ప్రేక్షకులు పోటెత్తారు. రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయింటే...

జీప్లెక్స్ ఓటీటీ ద్వారా రిలీజ్
రాధే చిత్రం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈ, ఇతర దేశాల్లో థియేటర్లలో రిలీజ్ అయింది. భారత్‌లో కరోనావైరస్ పరిస్థితులు దారుణంగా ఉండటంతో జీప్లెక్స్ ఓటీటీ యాప్ ద్వారా ఈ సినిమాను చూడటానికి రూ.249 టికెట్ ధరగా నిర్ణయించారు. రాధే చిత్రం దాదాపు ఏడాదిపాటు విడుదల వాయిదా పడి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రికార్డుస్థాయిలో 4.2 మిలియన్ వ్యూస్
సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రానికి జీ ప్లెక్స్ ఓటీటీలో మంచి రెస్సాన్స్ లభించింది. తొలి రోజున సుమారు రూ.4.2 మిలియన్ల వ్యూస్ లభించాయి. ఇది సల్మాన్ ఖాన్ కెరీర్లో ఇది సరికొత్త రికార్డుగా చెప్పుకోవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రాధే ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా
వాస్తవానికి రాధే చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను రూ.40 కోట్లకు, శాటిలైట్, డిజిటిల్, మ్యూజిక్, థియేట్రికల్ రైట్స్‌ను 190 కోట్లకు అమ్మడం జరిగిందనే విషయం ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తొలుత 230 కోట్లకు జరిగింది.

ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సవరింపు
ఇండియాలో థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో పూర్తిగా హక్కులను జీ ప్లెక్స్ ఇవ్వడం జరిగింది. దాంతో 40 కోట్ల మేరకు తగ్గించి ఓవరాల్ హక్కుల రేట్లను 190 కోట్ల రూపాయలకు కుదించి డీల్ కుదిరేలా నిర్ణయం తీసుకొన్నారు.
Recommended Video

రెండో రోజు కలెక్షన్లు ఇలా
రాధే చిత్రం రెండో రోజున ఆస్ట్రేలియాలో రూ.55 లక్షలు, న్యూజిలాండ్‌లో 10 లక్షలు వసూలు చేసింది. తొలి రోజు వసూళ్లతో పోల్చుకొంటే ఇది ఎక్కువనే అని చెప్పవచ్చు. తొలి రోజున ఆస్ట్రేలియాలో 55 లక్షల రూపాయలు, న్యూజిలాండ్‌లో 7 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక గల్ఫ్ దేశాల్లో తొలి వారాంతానికి ఈ చిత్రం 1 మిలియన్ డాలర్లు అంటే 7.3 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











