Salman Khan's Radhe Day 6 collections.. అక్కడ దారుణంగా కలెక్షన్లు 60 వేలే.. ఓవర్సీస్‌లో పరిస్థితి ఏమిటంటే!
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రం ఓవర్సీస్‌లో ఓ మోస్తారు కలెక్షన్లను రాబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో ఈ సినిమాపై క్రేజ్ అంతగా పెరగలేకపోయింది. అయినా సల్మాన్ ఖాన్ స్టామినాకు అటు ఇటుగా ఈ సినిమా వసూళ్లను రాబడుతున్నది. రాధే 6 రోజుల కలెక్షనల్ వివరాల్లోకి వెళితే..

ఈశాన్య రాష్ట్రాల్లోని...
దేశంలో కరోనావైరస్ పరిస్థితులు దారుణంగా ఉండటంతో థియేట్రికల్ రిలీజ్‌ను వాయిదా వేశారు. అయితే కరోనావైరస్ ప్రభావం లేని ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. అగర్తలాలోని ఎస్ఎస్ఆర్ ధర్మానగర్ థియేటర్‌లో రిలీజైంది. అయితే తొలి రోజు రూ.10,432, రెండో రోజు రూ.22,518, మూడో రోజు రూ.13,485, నాలుగో రోజు రూ.13,485 వసూలు చేసింది. దాంతో మొత్తంగా నాలుగు రోజుల్లో రూ.59,920 కలెక్షన్లను నమోదు చేసింది.

అమెరికాలో వసూళ్లు
ఓవర్సీస్ విషయానికి వస్తే.. అమెరికాలో తొలి రోజున రూ.57717 డాలర్లు అంటే రూ.42.29 లక్షలు, రెండో రోజున 53573 డాలర్లు అంటే రూ.39.25 లక్షలు, మూడో రోజున 54705 డాలర్లు అంటే రూ.39.95 లక్షలు, నాలుగో రోజున రూ.41148 డాలర్లు అంటే రూ.30.05 లక్షలు, ఐదో రోజున 11704 డాలర్లు అంటే రూ.8.54 లక్షలు వసూలు చేసింది. దాంతో మొత్తంగా రూ.1.59 కోట్లు వసూలు చేసింది.

బ్రిటన్‌లో రాబడి
బ్రిటన్‌లో తొలి రోజున రాధే చిత్రం 8,118 అమెరికన్ డాలర్లు అంటే.. రూ.5.92 లక్షలు రాబట్టింది. రెండో రోజున 6,260 డాలర్లు అంటే రూ.4.65 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ చిత్రం నార్తర్న్ ఐర్లాండ్‌లో మే 24వ తేదీన రిలీజ్ కానున్నది.

ఆస్ట్రేలియాలో మంచి స్పందన
ఇక ఆస్ట్రేలియాలో రాధే చిత్రం తొలి రోజున 48,706 అమెరికన్ డాలర్లు అంటే రూ.35.77 లక్షలు, రెండో రోజున 74966 డాలర్లు అంటే రూ.54 లక్షలు, మూడో రోజున 88658 డాలర్లు అంటే రూ.64.96 లక్షలు, నాలుగో రోజున 55742 డాలర్లు అంటే రూ.40.84 లక్షలు, ఐదో రోజున 19085 డాలర్లు అంటే రూ.13.97 లక్షలు, ఆరో రోజున 15661 డాలర్లు అంటే రూ.11.44 లక్షలు వసూలు చేసంది. దాంతో మొత్తంగా రూ.2.21 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

న్యూజిలాండ్‌లో వసూళ్లు
ఇక న్యూజిలాండ్ విషయాని వస్తే.. తొలి రోజున 8,258 డాలర్లు అంటే రూ.6.05 లక్షలు, రెండో రోజున 13,701 డాలర్లు అంటే రూ.10.03 లక్షలు, మూడో రోజున 16,091 డాలర్లు అంటే రూ.11.79 లక్షలు, నాలుగో రోజున 12,411 డాలర్లు అంటే 9.09 లక్షలు, ఐదో రోజున 3,877 డాలర్లు అంటే రూ.2.84 లక్షలు, ఆరో రోజున 2,889 డాలర్లు అంటే రూ.2.11 లక్షలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











