200 కోట్ల దాటేసిన టైగర్ జిందా హై.. బాక్సాఫీస్ వద్ద సల్మాన్ జోరు

By Rajababu

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం టైగర్ జిందాహై వసూళ్ల తుఫాన్ సృష్టిస్తున్నది. 2017లో విడుదలైన చిత్రాల కలెక్షన్లను ఈ చిత్రం అధిగమించి రికార్డు కలెక్షన్లను సాధిస్తున్నది. ట్యూబ్‌లైట్ చిత్రంతో ఘోర పరాజయం చవిచూసిన సల్మాన్‌కు ఈ చిత్రం ఊరటనిచ్చింది. గత 8 రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే..

Recommended Video

సల్మాన్ మరో బ్లాక్ బస్టర్.. ‘టైగర్ జిందా హై’మూవీ రివ్యూ..
 సల్మాన్ ఖాన్ స్టామినా

సల్మాన్ ఖాన్ స్టామినా

టైగర్ జిందా హై చిత్రం సల్మాన్ ఖాన్ స్టామినాను మరోసారి గుర్తు చేసింది. డిసెంబర్ 22న రిలీజైన ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఇంకా దూకుడునే ప్రదర్శిస్తున్నది.

 ఐదేళ్ల తర్వాత కత్రినాతో

ఐదేళ్ల తర్వాత కత్రినాతో

ఏక్ థా టైగర్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన టైగర్ జిందా హై చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. ఐదేళ్ల తర్వాత సల్మాన్ సరసన కత్రినా నటించడం ఫ్యాన్స్‌లో మంచి జోష్‌ను పెంచాయనే మాట బాలీవుడ్‌లో వినిపిస్తున్నది.

 వారం తర్వాత కూడా బలంగా

వారం తర్వాత కూడా బలంగా

టైగర్ జిందా హై చిత్రం శుక్రవారం (డిసెంబర్ 29న) కూడా భారీ కలెక్షన్లను సాధించింది. దాదాపు ఈ చిత్రం 18 కోట్ల రూపాయలను వసూలు చేయడాన్ని బట్టి సినిమాపై ప్రేక్షకుల ఆదరణ చెప్పకనే చెబుతున్నది.

 గోల్‌మాల్ అగైన్ అధిగమించిన

గోల్‌మాల్ అగైన్ అధిగమించిన

2017లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా అజయ్ దేవగణ్ సినిమా గోల్‌మాల్ అగైన్ కలెక్షన్లను అధిగమించింది. ప్రస్తుతం ఈ ఏడాదిలో 224.04 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా టైగర్ జిందా హై దూసుకెళ్తున్నది.

 8 రోజుల కలెక్షన్ల ఇవే

8 రోజుల కలెక్షన్ల ఇవే

టైగర్ జిందా హై చిత్రానికి సంబంధించిన గత 8 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 22న 34.10 కోట్లు, డిసెంబర్ 23న 35.30 కోట్లు, 24న 45.53 కోట్లు, 25న రూ.36.54 కోట్లు, డిసెంబర్ 26న రూ.21.60 కోట్లు, 27న 17.55 కోట్లు, డిసెంబర్ 28న రూ.15.42 కోట్లు, డిసెంబర్ 29న 18 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

 టైగర్ జిందా హై స్టోరీ ఇదే

టైగర్ జిందా హై స్టోరీ ఇదే

టైగర్ జిందా హై చిత్రంలో సల్మాన్ ఖాన్ రా ఏజెంట్‌గా, కత్రినా పాక్ గూఢచారిగా నటించారు. తీవ్రవాదులు చెరలో ఉన్న 25 మంది బందీలుగా నర్సులను కాపాడే ఆపరేషన్ నేపథ్యంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి మంచి ప్రజాదరణ లభిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X