సల్మాన్ కలెక్షన్ల సునామీ.. 300 కోట్ల క్లబ్‌లో టైగర్ జిందా హై..
Recommended Video

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. 2017లో రిలీజైన చిత్రాల్లో అత్యధికంగా వసూలు చేసిన చిత్రంగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమైపోయింది.

సల్మాన్ ఖాన్ మరోసారి
సల్మాన్, ఖాన్, అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్‌కు మరోసారి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సుల్తాన్ చిత్రం రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టైగర్ జిందా హై చిత్రం కూడా అదే జోష్‌తో ముందుకెళ్తున్నది.

సల్మాన్ ఖాన్ స్టామినా
టైగర్ జిందా హై చిత్రం రిలీజైన 13వ రోజు కూడా మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం బుధవారం (జనవరి 3న) సుమారు రూ.6 కోట్లు వసూలు చేయడం సల్మాన్ స్టామినాకు అద్దం పట్టింది.

13 రోజుల కలెక్షన్లు
టైగర్ జిందా హై చిత్రం 13 రోజులు కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఈ చిత్రం మొదటి రోజున రూ. 34.10 కోట్లు, రెండో రోజున రూ.35.30 కోట్లు, మూడో రోజున రూ.45.53 కోట్లు, నాలుగో రోజున 36.54 కోట్లు, ఐదో రోజున రూ.21.60 కోట్లు, ఆరో రోజున రూ. 17.55 కోట్లు, ఏడో రోజున రూ.15.42 కోట్లు వసూలు చేసింది.

జోష్ తగ్గని టైగర్
అలాగే సల్మాన్ చిత్రం రెండోవారంలో కూడా కలెక్షన్లు జోష్ ఏమాత్రం తగ్గలేదు. ఎనిమిదో రోజున రూ.11.56 కోట్లు, తొమ్మిదో రోజున రూ.14.92 కోట్లు, పదో రోజున రూ.22.23 కోట్లు, పదకొండో రోజున రూ.18.04 కోట్లు, 12వ రోజున రూ.7.83 కోట్లు, 13వ రోజున రూ.6 కోట్లు వసూలు చేసింది.

ఏక్ థా టైగర్ చిత్రానికి సీక్వెల్
2012 సంవత్సరంలో విడుదలైన ఏక్ థా టైగర్ చిత్రానికి సీక్వెల్‌గా టైగర్ జిందా హై చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో ‘రా' ఏజెంట్‌గా సల్మాన్, ఐఎస్ఐ ఏజెంట్‌గా కత్రినా కైఫ్ నటించింది. తీవ్రవాదుల చెరలో ఉన్న 25 మంది నర్సులను రక్షించే కథా నేపథ్యంగా ఈ చిత్రం రూపొందింది.


Click it and Unblock the Notifications











