Tiger 3 Movie 10 Days Collections: 300 కోట్ల సినిమాకు బిగ్ షాక్.. 10వ రోజే ఇలాంటి వసూళ్లా?
బాలీవుడ్ నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా సుదీర్ఘ కాలంగా హవాను చూపించడంతో పాటు వేరే దేశాల్లో సైతం మార్కెట్‌ను పెంచుకుంటూ వెళ్తోన్న హీరోల్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకడు. ఈ జోష్‌లోనే అతడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
ఇలా ఇటీవలే 'టైగర్ 3' అనే చిత్రంతో ఆడియోన్స్ ముందుకు వచ్చేశాడు. కానీ, ఈ మూవీకి మాత్రం ఆశించిన రీతిలో స్పందన రావడం లేదు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమై ఇది రోజు రోజుకూ డౌన్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'టైగర్ 3' మూవీ 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

టైగర్ 3 అంటూ వచ్చిన భాయ్: బడా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీనే 'టైగర్ 3'. సూపర్ హిట్ ఫ్రాంచైజీ మూవీలకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని మనీష్ శర్మ రూపొందించాడు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా చేశారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ అందించారు.

టైగర్ 3 మూవీ బిజినెస్.. రిలీజ్: సల్మాన్ - కత్రినా జంటగా నటించిన 'టైగర్ 3' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులను ఓ రేంజ్‌లో డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి దాదాపు 9000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

10వ రోజు ఎంత వచ్చిందంటే: మనీష్ శర్మ డైరెక్షన్‌లో సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ డీసెంట్‌గా లభించాయి. కానీ, ఆ తర్వాత నుంచి రెస్పాన్స్ క్రమంగా పడిపోతూనే ఉంటోంది. దీంతో ఈ మూవీకి వసూళ్లు డౌన్ అవుతున్నాయి. ఫలితంగా 10వ రోజు ఈ మూవీకి రూ. 6.35 కోట్లు నెట్ మాత్రమే వసూలైంది.
10 రోజులకూ కలిపి ఎంతంటే: సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'టైగర్ 3' మూవీకి టాక్‌కు అనుగుణంగానే పది రోజుల్లో చాలా తక్కువగానే స్పందనే వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం అనుకున్న దానికంటే దారుణమైన వసూళ్లనే రాబట్టింది. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 243.60 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 387 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

వరల్డ్ వైడ్‌గా ఎంత వచ్చింది: సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'టైగర్ 3' మూవీకి ఇండియా మొత్తంలో రూ. 285 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే అతడికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని అంతటా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. 10 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 12.3 మిలియన్ డాలర్లను (102 కోట్లు) వసూలు చేసింది. వీటితో కలిపితే రూ. 387 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'టైగర్ 3' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 10 రోజుల్లో ఈ సినిమా రూ. 243 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 57 కోట్లు నెట్ వసూళ్లను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. ఇప్పుడున్న ట్రెండ్ కొనసాగితే ఈ చిత్రం కోట్ల నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











