Tiger 3 Movie 1st Week Collections: 300 కోట్ల సినిమా.. వారంలో ఊహించని విధంగా.. హిట్ కావాలంటే మాత్రం!

రెండు మూడు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాపై కొందరు స్టార్లు మాత్రమే తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తున్నారు. అందులో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకడు. యాక్షన్ సినిమాలతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ఈ క్రమంలోనే ఇటీవలే సల్లూ భాయ్ 'టైగర్ 3' అనే మూవీతో వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో వసూళ్లు ఆశించినట్లుగా రావడం లేదు. అయినా ఫస్ట్ వీక్‌లో పర్వాలేదనిపించింది. మరి 'టైగర్ 3' మూవీ వారం రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూడండి!

 Salman Khan Starrer Tiger 3 Movie 1st Week Worldwide Box Office Collections

హిట్ ఫ్రాంచైజీతో వచ్చేశారుగా: పానిండియా స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన తాజా యాక్షన్ మూవీనే 'టైగర్ 3'. సూపర్ హిట్ ఫ్రాంచైజీ మూవీలకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని మనీష్ శర్మ రూపొందించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా చేశారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ అందించారు.

 Salman Khan Starrer Tiger 3 Movie 1st Week Worldwide Box Office Collections

టైగర్ 3 మూవీ బిజినెస్.. రిలీజ్: కండల వీరుడు సల్మాన్ నటించిన 'టైగర్ 3' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులను ఓ రేంజ్‌లో డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 9000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

 Salman Khan Starrer Tiger 3 Movie 1st Week Worldwide Box Office Collections

7వ రోజు ఎంత వచ్చిందంటే: సల్మాన్ ఖాన్ హీరోగా మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందిన 'టైగర్ 3' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ డీసెంట్‌గా లభించాయి. కానీ, ఆ తర్వాత నుంచి క్రమంగా రెస్పాన్స్ తగ్గడంతో వసూళ్లు కూడా డౌన్ అవుతూనే ఉన్నాయి. ఫలితంగా 7వ రోజైన శనివారం ఈ మూవీకి రూ. 17 కోట్లు నెట్‌, రూ. 30 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఏడు రోజులకూ కలిపి ఎంత: సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా ఏడు రోజుల్లో పర్వాలేదనిపించే స్పందనే వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం అనుకున్న దానికంటే తక్కువ వసూళ్లనే రాబట్టింది. ఇలా మొదటి వారం రోజుల్లోనే ప్రతికూల ప్రభావాల ఉన్నా ఈ చిత్రం రూ. 217.90 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 342 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

 Salman Khan Starrer Tiger 3 Movie 1st Week Worldwide Box Office Collections

వరల్డ్ వైడ్‌గా ఎంత వచ్చింది: సల్మాన్ ఖాన్‌ హీరోగా నటించిన 'టైగర్ 3' మూవీకి ఇండియా మొత్తంలో రూ. 261 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే అతడికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని అంతటా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. 7 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 9.8 మిలియన్ డాలర్లను (81 కోట్లు) వసూలు చేసింది. వీటితో కలిపితే రూ. 342 కోట్లు గ్రాస్ వచ్చింది.

 Salman Khan Starrer Tiger 3 Movie 1st Week Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'టైగర్ 3' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 7 రోజుల్లో ఈ సినిమా రూ. 217 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 83 కోట్లు నెట్‌ వసూళ్లను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. ఇప్పుడున్న ట్రెండ్ కొనసాగితే ఈ చిత్రం టార్గెట్‌ను చేరడం కష్టంగా మారొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X