Tiger 3 Movie 2 Days Collections: సల్మాన్ ఊరమాస్.. ఇటు 100.. అటు 200 కోట్లు ఔట్.. తెలుగులో ఎంతంటే!
పక్కా కమర్షియల్ సినిమాలతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటూనే వెళ్తున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అతడు భారీ హిట్‌ను ఖాతాలో వేసుకోలేదు. ఈ పరిస్థితుల్లోనే తాజాగా సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. దీనికి దీపావళి సెలవు కావడంతో మొదటి రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండో రోజు స్పందన పెరగడంతో భారీ వసూళ్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో 'టైగర్ 3' 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో చూసేద్దాం పదండి!
హిట్ సీక్వెల్‌తో వచ్చిన సల్మాన్:పాన్ ఇండియా స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన క్రేజీ యాక్షన్ మూవీనే 'టైగర్ 3'. సూపర్ హిట్ మూవీలకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని మనీష్ శర్మ తెరకెక్కించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. ఈ క్రేజీ యాక్షన్ మూవీకి ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా నటించారు.

టైగర్ 3 మూవీ బిజినెస్.. రిలీజ్:కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో హైప్ ఏర్పడింది. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 9000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.
2వ రోజు ఇండియాలో ఎంత?:మనీష్ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మిక్స్‌డ్ టాక్ లభించింది. దీంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ డీసెంట్‌గా లభించాయి. అయితే, రెండో రోజు మాత్రం రెస్పాన్స్ భారీ స్థాయిలో పెరిగింది. ఫలితంగా సోమవారం ఈ మూవీకి రూ. 57 కోట్లు నెట్‌తో పాటు రూ. 107 కోట్లు వచ్చింది.

రెండు రోజులకూ కలిపి ఇలా:సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీకి రెండు రోజుల్లో భారీ స్పందన వచ్చింది. ఫలితంగా హిందీ వెర్షన్‌కు రూ. 99.43 కోట్లు, తెలుగులో రూ. 2.17 కోట్లు, తమిళంలో రూ. 42 లక్షలు నెట్ వసూళ్లు వచ్చాయి. ఇలా రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 102.02 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 201 కోట్లు గ్రాస్ కలెక్షన్లను సైతం రాబట్టి సంచలనం సృష్టించింది.
వరల్డ్ వైడ్‌గా ఎంత వచ్చింది:సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన 'టైగర్ 3' మూవీకి ఇండియా మొత్తంలో రూ. 160 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే అతడికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని అంతటా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. రెండు రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 5 మిలియన్ డాలర్లను (41 కోట్లు) వసూలు చేసింది. వీటితో కలిపితే రూ. 201 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టైగర్ 3' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2 రోజుల్లో ఈ సినిమా రూ. 102 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 198 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











