Tiger3 Movie 3 Days Collections: సల్మాన్ మాస్ బ్యాటింగ్.. 3 రోజుల్లోనే అన్ని కోట్లు.. హిట్ కావాలంటే!
ఇండియన్ సినిమాపై చాలా మంది హీరోలు తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించారు. అందులో బాలీవుడ్‌కు చెందిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారిలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకడు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న అతడు.. చాలా కాలంగా బిగ్గెస్ట్ హిట్ కోసం చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవలే 'టైగర్ 3' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ మాత్రం బాగానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'టైగర్ 3' మూవీ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరు కూడా చూసేయండి మరి!
మరోసారి టైగర్‌గా సల్మాన్ ఎంట్రీ:బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన యాక్షన్ సినిమానే 'టైగర్ 3'. సూపర్ హిట్ మూవీలకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని మనీష్ శర్మ రూపొందించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా చేశారు.

టైగర్ 3 మూవీ బిజినెస్.. రిలీజ్:పాన్ ఇండియా స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో హైప్ ఏర్పడింది. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 9000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేసుకున్నారు.
3వ రోజు ఎంత వచ్చిందంటే:మనీష్ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'టైగర్ 3' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు ఓపెనింగ్స్ డీసెంట్‌గా లభించాయి. అయితే, రెండో రోజు మాత్రం రెస్పాన్స్ పెరిగింది. మూడో రోజు కూడా బాగానే హోల్డ్ చేసింది. ఫలితంగా మంగళవారం ఈ మూవీకి రూ. 42 కోట్లు నెట్, రూ. 80 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూడు రోజులకూ కలిపి ఇలా:సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీకి మూడు రోజుల్లో భారీ స్పందన వచ్చింది. ముఖ్యంగా హిందీలోనే ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు, తమిళంలో కూడా డీసెంట్ నెంబర్లను తెచ్చుకుంటోంది ఇలా మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 146 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 235 కోట్లు గ్రాస్ కలెక్షన్లను సైతం రాబట్టి సంచలనం సృష్టించింది.
వరల్డ్ వైడ్‌గా ఎంత వచ్చింది:సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన 'టైగర్ 3' మూవీకి ఇండియా మొత్తంలో రూ. 181 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే అతడికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని అంతటా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. 3 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 6.5 మిలియన్ డాలర్లను (54 కోట్లు) వసూలు చేసింది. వీటితో కలిపితే రూ. 235 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టైగర్ 3' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 3 రోజుల్లో ఈ సినిమా రూ. 146 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 154 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











