Tiger3 Movie 4 Days Collections: 4వ రోజు షాకింగ్‌గా.. అప్పుడే అన్ని కోట్లు.. హిట్ కావాలంటే మాత్రం!
బాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో కొందరు మాత్రమే మాస్ ఇమేజ్‌తో సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకడు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపిస్తోన్న అతడు.. భారీ హిట్ కోసం వేచి చూస్తూనే ఉన్నాడు. ఇందుకోసం ఇటీవలే 'టైగర్ 3' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ మాత్రం డీసెంట్‌గానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'టైగర్ 3' మూవీ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరు కూడా చూసేయండి మరి!
సూపర్ హిట్ సిరీస్‌తో వచ్చేశాడు:బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'టైగర్ 3'. సూపర్ హిట్ మూవీలకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని మనీష్ శర్మ రూపొందించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా చేశారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ ఇచ్చారు.

టైగర్ 3 మూవీ బిజినెస్.. రిలీజ్:కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 9000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.
4వ రోజు ఎంత వచ్చిందంటే:మనీష్ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు ఓపెనింగ్స్ డీసెంట్‌గా లభించాయి. మూడు రోజుల వరకూ ఇది బాగానే పెర్ఫార్మ్ చేసింది. కానీ, నాలుగో రోజు డల్ అయింది. ఫలితంగా బుధవారం ఈ మూవీకి రూ. 22 కోట్లు నెట్, రూ. 36 కోట్లు గ్రాస్ వచ్చింది.

నాలుగు రోజులకూ కలిపి ఇలా:సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీకి నాలుగు రోజుల్లో మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా హిందీలోనే ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు, తమిళంలో మాత్రం కాస్త తక్కువగానే రాణిస్తోంది. ఇలా నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 169 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 271 కోట్లు గ్రాస్ కలెక్షన్లను సైతం రాబట్టి సంచలనం సృష్టించింది.
వరల్డ్ వైడ్‌గా ఎంత వచ్చింది:స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన 'టైగర్ 3' మూవీకి ఇండియా మొత్తంలో రూ. 209 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే అతడికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని అంతటా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. 4 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 7.55 మిలియన్ డాలర్లను (62 కోట్లు) వసూలు చేసింది. వీటితో కలిపితే రూ. 271 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:హిట్ సిరీస్‌లో వచ్చిన 'టైగర్ 3' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 4 రోజుల్లో ఈ సినిమా రూ. 169 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 131 కోట్లు నెట్ వసూళ్లను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











