Tiger 3 Movie 5 Days Collections: సల్మాన్‌కు బిగ్ షాక్.. 5 రోజుల్లో ఇంతేనా.. అదే జరిగితే డిజాస్టరే!
ఇప్పుడున్న హీరోల్లో ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపిస్తున్న వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకడు. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో భారీ విజయాన్ని మాత్రం అందుకోవట్లేదు.
దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో 'టైగర్ 3' అనే మూవీ చేశాడు. దీనికి క్రమంగా వసూళ్లు డౌన్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరు కూడా చూసేయండి మరి!

హిట్ మూవీకి సీక్వెల్‌తో వచ్చాడు: కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా యాక్షన్ సినిమానే 'టైగర్ 3'. సూపర్ హిట్ మూవీలకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని మనీష్ శర్మ రూపొందించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా చేశారు.

టైగర్ 3 మూవీ బిజినెస్.. రిలీజ్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 9000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

5వ రోజు ఎంత వచ్చిందంటే: మనీష్ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ డీసెంట్‌గా లభించాయి. కానీ, ఆ తర్వాత నుంచి క్రమంగా రెస్పాన్స్ డౌన్ అవడంతో వసూళ్లు పడిపోతూనే ఉన్నాయి. ఫలితంగా గురువారం ఈ మూవీకి రూ. 18.50 కోట్లు నెట్, రూ. 26 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఐదు రోజులకూ కలిపి ఇలా: సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీకి ఐదు రోజుల్లో స్పందన తక్కువే వచ్చింది. అయితే హిందీలోనే ఈ చిత్రం తక్కువ వసూళ్లను రాబడుతోంది. తెలుగు, తమిళంలో మాత్రం కాస్త తక్కువగానే రాణిస్తోంది. ఇలా ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 187 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 297 కోట్లు గ్రాస్ కలెక్షన్లను సైతం రాబట్టి 300 కోట్లకు చేరువగా వచ్చింది.

వరల్డ్ వైడ్‌గా ఎంత వచ్చింది: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన 'టైగర్ 3' మూవీకి ఇండియా మొత్తంలో రూ. 229 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే అతడికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని అంతటా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. 5 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 8.2 మిలియన్ డాలర్లను (68 కోట్లు) వసూలు చేసింది. వీటితో కలిపితే రూ. 297 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ హిట్లకు సీక్వెల్‌గా వచ్చిన 'టైగర్ 3' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 5 రోజుల్లో ఈ సినిమా రూ. 187 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 113 కోట్లు నెట్ వసూళ్లను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. ఇప్పుడున్న ట్రెండ్ కొనసాగితే ఈ చిత్రం డిజాస్టర్ అయ్యే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications











