Tiger 3 Movie 6 Days Collections: సల్మాన్ మూవీ హెవీ డ్రాప్.. అక్కడ 300 కోట్లు.. ఇక్కడ 200 కోట్లు ఔట్
సల్మాన్ ఖాన్.. ఈ పేరు ఇండియాలోనే ఒక సంచలనం. అంతలా అతడు బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు. ఇలా క్రమంగా తన రేంజ్‌ను పెంచుకుంటూనే ఉన్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం సల్లూ భాయ్ పెద్దగా హిట్లను ఖాతాలో వేసుకోవట్లేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ బడా హీరో 'టైగర్ 3' అనే మూవీని చేశాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో వసూళ్లు డల్‌గానే వస్తున్నాయి. అయినా తాజాగా ఈ మూవీ మైలురాళ్లు దాటింది. మరి 'టైగర్ 3' మూవీ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూడండి!
మళ్లీ యాక్షన్ మోడ్‌లో సల్మాన్:బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా యాక్షన్ మూవీనే 'టైగర్ 3'. సూపర్ హిట్ మూవీలకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని మనీష్ శర్మ రూపొందించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా చేశారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ ఇచ్చారు.

టైగర్ 3 మూవీ బిజినెస్.. రిలీజ్:సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులను ఓ రేంజ్‌లో డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 9000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.
6వ రోజు ఎంత వచ్చిందంటే:మనీష్ శర్మ డైరెక్షన్‌లో బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ డీసెంట్‌గా లభించాయి. కానీ, ఆ తర్వాత నుంచి క్రమంగా రెస్పాన్స్ తగ్గుతుండడంతో వసూళ్లు పడిపోతున్నాయి. ఫలితంగా శుక్రవారం ఈ మూవీకి రూ. 13 కోట్లు నెట్, రూ. 18 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఆరు రోజులకూ కలిపి ఎంత:సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీకి ఆరు రోజుల్లో మోస్తరు స్పందనే వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం అనుకున్న దానికంటే తక్కువగానే వసూళ్లను రాబడుతోంది. ఇలా ఆరు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 200.65 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 312 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా ఒకేసారి ఇటు రెండు వందల కోట్లు, అటు మూడు వందల కోట్ల మార్కును దాటింది.
వరల్డ్ వైడ్‌గా ఎంత వచ్చింది:కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేసిన 'టైగర్ 3' మూవీకి ఇండియా మొత్తంలో రూ. 239 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే అతడికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని అంతటా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. 6 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 8.8 మిలియన్ డాలర్లను (73 కోట్లు) వసూలు చేసింది. వీటితో కలిపితే రూ. 312 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన 'టైగర్ 3' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 6 రోజుల్లో ఈ సినిమా రూ. 200 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 100 కోట్లు నెట్ వసూళ్లను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. ఇప్పుడున్న ట్రెండ్ కొనసాగితే ఈ చిత్రం టార్గెట్‌ను చేరడం కష్టం అవుతుంది.


Click it and Unblock the Notifications











