Tiger 3 Movie 8 Days Collections: సల్మాన్‌కు వరల్డ్ కప్ షాక్.. సండే దారుణంగా.. కోట్ల నష్టాల దిశగా!
పేరుకు హిందీ పరిశ్రమకు చెందిన హీరోనే అయినా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్. కెరీర్ ఆరంభంలో లవ్ స్టోరీలతో ప్రేక్షకులను ఫిదా చేసిన అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం యాక్షన్ సినిమాలతో వస్తున్నాడు. ఇలా ఇప్పుడు 'టైగర్ 3' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ మూవీకి మాత్రం ఆశించిన రీతిలో రెస్పాన్స్ రావడం లేదు. ఈ పరిస్థితుల్లో దీనిపై వరల్డ్ కప్ ఫైనల్ ప్రభావాన్ని చూపించింది. ఈ నేపథ్యంలో 'టైగర్ 3' మూవీ 8 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో టైగర్ 3:బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన తాజా యాక్షన్ మూవీనే 'టైగర్ 3'. సూపర్ హిట్ ఫ్రాంచైజీ మూవీలకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని మనీష్ శర్మ రూపొందించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ అందించారు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా చేశారు.

టైగర్ 3 మూవీ బిజినెస్.. రిలీజ్:సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'టైగర్ 3' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులను ఓ రేంజ్‌లో డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి దాదాపు 9000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
8వ రోజు ఎంత వచ్చిందంటే:మనీష్ శర్మ డైరెక్షన్‌లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'టైగర్ 3' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ డీసెంట్‌గా లభించాయి. కానీ, ఆ తర్వాత నుంచి క్రమంగా డౌన్ అవుతోంది. వరల్డ్ కప్ ఫైనల్ రోజు బాగా ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా 8వ రోజైన సండే ఈ మూవీకి రూ. 10.25 కోట్లు నెట్, రూ. 20 కోట్లు గ్రాస్ వచ్చింది.

8 రోజులకూ కలిపి ఎంతంటే:సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా ఎనిమిది రోజుల్లో చాలా తక్కువగానే స్పందనే వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం అనుకున్న దానికంటే దారుణమైన వసూళ్లనే రాబట్టింది. ఇలా ఎనిమిది రోజుల్లోనే ప్రతికూల ప్రభావాల ఉన్నా ఈ చిత్రం రూ. 229.65 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 372 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.
వరల్డ్ వైడ్‌గా ఎంత వచ్చింది:సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'టైగర్ 3' మూవీకి ఇండియా మొత్తంలో రూ. 283 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే అతడికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని అంతటా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. 7 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 10.8 మిలియన్ డాలర్లను (89 కోట్లు) వసూలు చేసింది. వీటితో కలిపితే రూ. 372 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'టైగర్ 3' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 8 రోజుల్లో ఈ సినిమా రూ. 229 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 71 కోట్లు నెట్ వసూళ్లను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. ఇప్పుడున్న ట్రెండ్ కొనసాగితే ఈ చిత్రం కోట్ల నష్టాలను ఎదుర్కొనే చాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











