Tiger 3 Movie Day 1 Collections: కుమ్మేసిన టైగర్.. తొలి రోజే అన్ని కోట్లు.. ప్రభాస్ రికార్డు బ్రేక్

బాలీవుడ్‌లో చాలా మంది స్టార్లు ఎన్నో ఏళ్ల క్రితమే పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును తెచ్చుకున్నారు. అందులో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకడు. పక్కా కమర్షియల్ సినిమాలతో సత్తా చాటుతోన్న అతడు.. చాలా కాలంగా భారీ హిట్ కోసం వేచి చూస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలని 'టైగర్ 3' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి దీపావళి సెలవు కావడంతో మొదటి రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టింది. మరి 'టైగర్ 3' ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో చూసేద్దాం పదండి!

టైగర్‌గా సల్మాన్ మళ్లీ వచ్చాడు:బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా యాక్షన్ మూవీనే 'టైగర్ 3'. సూపర్ హిట్ మూవీలకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని మనీష్ శర్మ తెరకెక్కించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా నటించారు. ఈ క్రేజీ యాక్షన్ మూవీకి ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ ఇచ్చారు.

Salman Khan Starrer Tiger 3 Movie Day 1 Worldwide Box Office Collections

టైగర్ 3 మూవీ బిజినెస్.. రిలీజ్:స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 9000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

అలాంటి టాక్... డీసెంట్‌గానే:సల్మాన్ ఖాన్ హీరోగా ఫుల్ లెంగ్త్ యాక్షన్ జోనర్‌లో రూపొందిన 'టైగర్ 3' మూవీ భారీ అంచనాల నడుమ నవంబర్ 12వ తేదీన విడుదలైంది. దీనికి ఓవర్సీస్‌లోని ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ సెలవు దినం కావడంతో మొటి రోజు ఈ చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. దీంతో ఈ మూవీకి డీసెంట్ ఓపెనింగ్స్ వస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు.

తొలి రోజు ఇండియాలో ఇలా:మనీష్ శర్మ దర్శకత్వంలో సీనియర్ పానిండియా స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మిక్స్‌డ్ టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా మిశ్రమంగా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు డీసెంట్‌గానే వచ్చాయి. ఇలా మొదటి రోజే ఈ మూవీకి ఇండియాలో రూ. 43 కోట్లు నెట్‌తో పాటు రూ. 65 కోట్లు వరకూ గ్రాస్ వసూలైంది.

Salman Khan Starrer Tiger 3 Movie Day 1 Worldwide Box Office Collections

వరల్డ్ వైడ్‌గా ఎంత వచ్చింది:సల్మాన్ ఖాన్‌కు వరల్డ్ వైడ్‌గా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని అంతటా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇక మొదటి రోజు పూర్తయ్యే సరికి ఈ సినిమా ఓవర్సీస్‌లో 2.25 మిలియన్ డాలర్లను (18.8 కోట్లు) వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రం మొదటి రోజు రూ. 53 కోట్లు వరకూ నెట్ కలెక్షన్లతో పాటు రూ. 80 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టైగర్ 3' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఇది రూ. 53 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 247 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది.

ప్రభాస్ రికార్డును బ్రేక్ చేసి:సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీ మొదటి రోజు ఆశించిన దానికంటే తక్కువ వసూళ్లనే రాబట్టింది. అయినప్పటికీ ఇది ఇండియాలో రూ. 43 కోట్లు నెట్ కలెక్షన్లను సాధించింది. దీంతో 2023లో ఓపెనింగ్ డేన అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో 3వ స్థానానికి చేరింది. ఈ క్రమంలోనే గదర్ 2, ఆదిపురుష్ రికార్డులు బ్రేక్ చేసింది. ఇందులో జవాన్, పఠాన్ టాప్‌లో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X