Radhe Day 1 collections & views: కింగ్ ఆఫ్ ది గల్ఫ్ సల్మాన్ హవా.. ఫస్ట్ డే కలెక్షన్లు ఎలా అంటే..

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ చిత్రం రంజాన్ పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశంలో కరోనావైరస్ పరిస్థితులు దారుణంగా మారడంతో థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీ ద్వారా సల్మాన్ అభిమానుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం యూఏఈలో థియేటర్లలో రిలీజ్ కావడం గమనార్హం. అయితే తొలి రోజు రాధే కలెక్షన్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎలా ఉన్నాయంటే...

ఓటీటీకి మొగ్గు చూపిన సల్మాన్

ఓటీటీకి మొగ్గు చూపిన సల్మాన్

దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనావైరస్ పరిస్థితులు చేజారిపోవడంతో అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డాయి. పలు రాష్ట్రాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ తన ఈద్ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే థియేటర్ యాజమాన్యాలు సినిమా రిలీజ్ వాయిదా వేయమని కోరినా సల్మాన్ తన సినిమాను దేశంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

 రాధే మూవీకి యూఏఈ గ్రీన్ సిగ్నల్

రాధే మూవీకి యూఏఈ గ్రీన్ సిగ్నల్

సల్మాన్ నటించిన రాధే చిత్రాన్ని తమ దేశంలోని థియేటర్లలో రిలీజ్ చేయడానికి ఇక యూఏఈ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అబుదాబీ, రాస్ అల్ ఖైమా, షార్జా, అల్ మార్యా ఐలాండ్, తదితర ప్రాంతాల్లోని మాల్స్‌లో ఈ సినిమా ప్రదర్శనలకు అనుమతులు ఇచ్చారు.

రాధే అడ్వాన్స్ బుకింగ్ రిపోర్టు

రాధే అడ్వాన్స్ బుకింగ్ రిపోర్టు

అయితే తొలి రోజు రాధే అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే పెద్దగా స్పందన కనిపించలేదు. పలు ప్రాంతాల్లో సగటును 40 నుంచి 50 శాతం మేరకు అడ్వాన్స్ బుకింగ్ కనిపించింది. తొలి ఆటకు సుమారు 60 శాతం అక్యుపెన్సీ నమోదు అయినట్టు సమాచారం. అయితే సల్మాన్ ఖాన్ స్టామినాకు తగినట్టుగా మూవీ అడ్వాన్స్ బుకింగ్, అక్యుపెన్సీ లేకపోవడం గమనార్హం.

కింగ్ ఆఫ్ ది గల్ఫ్ సల్మాన్ ఖాన్

కింగ్ ఆఫ్ ది గల్ఫ్ సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్‌కు 'కింగ్ ఆఫ్ ది గల్ఫ్' అనే పేరు ఉంది. అందుకు తగినట్టుగానే ప్రస్తుత పరిస్థితుల్లో ఫర్వాలేదనిపించే విధంగా సల్మాన్ ఖాన్ రాధే బాక్సాఫీస్ జర్నీ ప్రారంభమైంది. అయితే గతంలో మాదిరిగా సల్మాన్ ఖాన్ సాధించిన రికార్డు కలెక్షన్లు నమోదు కాకపోవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Recommended Video

Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
తొలి రోజు కలెక్షన్ల అంచనా...

తొలి రోజు కలెక్షన్ల అంచనా...

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఓవర్సీస్‌లో థియేటర్లలో రాధే సాధించే కలెక్షన్లపై తమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజున యూఏఈలో రూ.5 కోట్ల మేర వసూళ్లను సాధించే అవకాశం ఉందనే పేర్కొంటున్నారు. అయితే ఈ రేంజ్‌లో వసూళ్లను సాధిస్తుందా అనేది వేచి చూడాల్సిందే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X