twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Salman Khan's Radhe Day 3 collections: ఎంత మేరకు నష్టం.. లాభాల్లోకి రావాలంటే?

    |

    బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, డైరెక్టర్ ప్రభుదేవా కాంబినేషన్‌లో రాధే చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే భారత్‌లో కోవిడ్ పరిస్థితుల కారణంగా జీప్లెక్స్ ఓటీటీ యాప్ ద్వారా ప్రేక్షకులకు చేరువైంది. అయితే తొలి రోజే ఈ చిత్రాన్ని యాప్‌లో 4.2 మిలియన్ల మంచి ఈ సినిమాను వీక్షించడం రికార్డుగా మారింది. అయితే ఓవర్సీస్‌లో థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ చిత్రం మూడో రోజు సాధించే అంచనా కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే...

    190 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌

    190 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌

    రాధే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. శాటిలైట్, డిజిటల్, ఓటీటీ హక్కులను సుమారు 190 కోట్ల రూపాయలకు జీప్లెక్స్ సొంతం చేసుకొన్నది. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్‌కు ఈ బిజినెస్ 230 కోట్లుగా నమోదు అయింది. అయితే భారత్‌లో థియేట్రికల్ రిలీజ్ వాయిదా పడటంతో దాదాపు 40 కోట్ల రూపాయలు తగ్గించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    గల్ఫ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో

    గల్ఫ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో

    ఇక భారత్ మినహాయిస్తే రాధే చిత్రం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బెహ్రయిన్ లాంటి దేశాల్లో థియేట్రికల్ రిలీజ్ అయింది. గురువారం నుంచి శనివారం వరకు ఓవర్సీస్‌లో భారీగా రెస్సాన్స్ లభిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    గల్ఫ్‌లో గత మూడు రోజుల్లో

    గల్ఫ్‌లో గత మూడు రోజుల్లో

    రాధే చిత్రం గల్ఫ్ దేశాల్లో భారీగా వసూళ్లను రాబట్టింది. గురువారం $4,80,000 అంటే తొలి రోజున 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో శుక్రవారం $4,00,000 (సుమారు 3 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇక శనివారం కూడా దాదాపు రూ.3 కోట్ల రూపాయల మేర వసూలు చేసే అవకాం ఉందనే విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వారాంతానికి 1 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను నమోదుచేస్తుందని చెబుతున్నారు.

    ఓటీటీలో సరికొత్త ప్రయోగం

    ఓటీటీలో సరికొత్త ప్రయోగం

    సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రం రిలీజ్ విషయంలో ఓటీటీలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రాన్ని పే ఫర్ వ్యూ (డబ్బు చెల్లించి చూసే పద్దతి)న జీ ప్లెక్స్‌లో ప్రదర్శించారు. ఇండియన్ సినిమా రంగంలో pay per view అత్యధికంగా వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డుకు ఎక్కింది. దాదాపు 100 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించినట్టు తెలుస్తున్నది.

    రాధే లాభాల్లోకి రావాలంటే..

    రాధే లాభాల్లోకి రావాలంటే..

    ఇదిలా ఉండగా, రాధే చిత్రం 195 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో కలెక్షన్ల జర్నీని ప్రారంభించిన చిత్రం ఓటీటీ, ఓవర్సీస్ కలెక్షన్లను కలుపుకొంటే ఇప్పటికే రూ.160 కోట్ల మేర వసూళ్లను సాధించినట్టు తెలుస్తున్నది. త్వరలోనే బ్రేక్ ఈవెన్ కూడా సాధించే అవకాశం ఉందని తెలుస్తున్నది.

    English summary
    Salman Khan's Radhe movie Theatrical release started with good note in UAE. As per Trade reports, Day 3 expected collections and Advance Booking in UAE started avarage in many places. This movie registered 190 crores pre release business. Presently, its collected 160 crores from Zee Plex pay per view and Overseas collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X