Salman Khan's Radhe Day 4 collections: ఓటీటీలో దిమ్మ తిరిగే రికార్డులు.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా..
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కాంబినేషన్‌లో వచ్చిన రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోతున్నది. కరోనావైరస్ పరిస్థితుల్లో కేవలం ఓవర్సీస్‌లోనే రిలీజ్ అయిన రాధే చిత్రం ఓటీటీలో రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లోను, ఓటీటీలోను రాధే వసూలు చేసిన కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే...
Recommended Video
బిగ్‌బాస్ బ్యూటీ భాను శ్రీ అందాల విందు.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్

జీ ప్లెక్స్ ఓటీటీలో రికార్డు
రాధే చిత్రం ఓటీటీలో రికార్డుస్థాయిలో స్పందనను సొంతం చేసుకొన్నది. ఎవరూ ఊహించిన విధంగా జీ ప్లెక్స్ ఓటీటీలో సబ్‌స్క్రిప్షన్లను సాధించింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే ఓటీటీలో అత్యధిక మంది చూసిన చిత్రంగా రికార్డును నెలకొల్పింది. తొలి రోజున 4.2 మిలియన్ల మంది వీక్షించడం ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.
ప్రియమణి బోల్డ్ అండ్ బ్యూటీపుల్ గ్యాలరీ.. మీరెప్పుడూ చూడని ఫోటోలు

ఓవర్సీస్‌లోనే రిలీజ్ చేయాలని
దేశంలో కరోనా పరిస్థితుల ప్రభావం తీవ్రంగా ఉండటంతో థియేట్రికల్ రిలీజ్‌ను సల్మాన్ ఖాన్ వాయిదా వేశారు. కేవలం ఓవర్సీస్‌లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకొన్న నిర్మాతలు.. యూఏఈ, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇతర దేశాల్లో రాధేను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

మూడు రోజుల కలెక్షన్లు
రాధే చిత్రం గత మూడు రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే. యూఏఈ, గల్ఫ్ దేశాల్లో రూ.9.20 కోట్లు సాధించింది. యూఎస్ఏలో రూ.1.2 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ.1.60 కోట్లు, న్యూజిలాండ్‌లో రూ.30 లక్షలు సాధించింది. మిగితా దేశాల్లో రూ.1.10 కోట్లు రాబట్టింది. దీంతో మూడు రోజుల్లో రూ.13 కోట్లకుపైగా వసూలు చేసింది.

నాలుగో రోజు కలెక్షన్ల అంచనా
ఓవర్సీస్‌లో రాధే చిత్రానికి సంబంధించిన 4 రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే. తొలి రోజున రూ.4.75 కోట్లు, రెండో రోజున రూ.4.45 కోట్లు, మూడో రోజున రూ.4.30 కోట్లు సాధించింది. ఇక ఆదివారం నాలుగో రోజున సుమారు రూ.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా 18 కోట్లకుపైగా వసూలు చేస్తుందని పేర్కొన్నారు.

హై లెవెల్లో ప్రీ రిలీజ్ బిజినెస్
సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రం రిలీజ్‌కు ముందు భారీగా బిజినెస్ చేసింది. ఈ చిత్రానికి తొలుత 230 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అయితే భారత్‌లో థియేట్రికల్ రిలీజ్ వాయిదా పడటంతో ఆ మొత్తాన్ని రూ.190 కోట్లకు కుదించారు. సల్మాన్ కెరీర్‌లో అత్యధికంగా ప్రీ రిలీజ్ చేసిన చిత్రాల్లో రాధే ఒకటిగా నిలిచింది.


Click it and Unblock the Notifications











