Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Salman Khan's Radhe Day 5 collections: రికార్డులు తిరగరాస్తున్న రాధే.. బాహుబలి రికార్డుపై కన్నేసిన సల్మాన్
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రం ఎవరూ ఊహించనంత రేంజ్లో సక్సెస్ సాధిస్తున్నది. ఈ చిత్రంపై చిత్ర విమర్శకులు పెదవి విరిచినా ఓటీటీ, ఓవర్సీస్లో మంచి రెస్పాన్స్ రాబడుతున్నది. ప్రభుదేవా దర్శకత్వంలో అందాల భామ దిశా పటానీ నటించిన ఈ చిత్రం గత 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..
125 కోట్ల బడ్జెట్‌తో
సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన రాధే చిత్రానికి కొరియన్ చిత్రం ది అవుట్ లాస్ ఆధారం. ఈ సినిమా సుమారు. 125 కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ సినిమాను రిలీజ్‌కు ముందు దాదాపు 190 కోట్ల మేరకు బిజినెస్ చేశారు.
ఓటీటీ, ఓవర్సీస్లో
రాధే సినిమాకు సంబంధించిన ఓటీటీ, డిజిటిల్, థియేట్రికల్, శాటిలైట్ లాంటి హక్కులను జీటీవీ సొంతం చేసుకొన్నది. దేశంలో కరోనావైరస్ పరిస్థితులు దారుణంగా ఉండటంతో సినిమా థియేట్రికల్ రిలీజ్‌ను వాయిదా వేశారు. దాంతో ఓటీటీతోపాటు అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కువైట్; యూఏఈ, గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేశారు.
తొలిరోజే 100 కోట్ల క్లబ్లో
రాధే రిలీజ్ తర్వాత ప్రభుదేవా, సల్మాన్ ఖాన్‌ను భారీగా ట్రోల్ చేశారు. అయినా ఓటీటీలో అభిమానులు, సినిమా ప్రేక్షకులు పోటెత్తారు. 249 రూపాయల పే పర్ వ్యూ పద్దతిలో తొలి రోజే 4.2 మిలియన్ మంది వీక్షించారు. దాంతో తొలి రోజు ఈ చిత్రం ఓటీటీ, ఓవర్సీస్ బాక్సాఫీస్ అన్నీ కలిపి 104 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరింది.
తొలి రోజే ఓటీటీలో రికార్డులు
ఇక రెండో రోజు సెలవు దినం కావడంతో ఓటీటీ+ఓవర్సీస్తో కలిపి 121 కోట్లు, మూడో రోజున రూ.71 కోట్లు, నాలుగో రోజున రూ.65 కోట్లు, ఐదో రోజున 53 కోట్లను కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా రూ.388 కోట్ల రూపాయాలను వసూలు చేసింది. ఇక ఈ చిత్రం బాహుబలి రికార్డులపై కన్నేసిందనే మాట ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. అయితే ఈ వసూళ్లను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
Recommended Video
5 రోజుల ఓవర్సీస్ కలెక్షన్లు
ఓవర్సీస్లో వసూళ్ల విషయానికి వస్తే.. తొలి రోజు రాధే చిత్రం రూ.7.20 కోట్లు, రెండో రోజు రూ.5.70 కోట్లు, మూడో రోజు రూ.4.20 కోట్లు, నాలుగో రోజు రూ.2.88 కోట్లు, ఐదో రోజున రూ.1.5 కోట్లు వసూలు చేసింది. దాంతో మొత్తంగా ఈ సినిమా రూ.10 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.