Sikandar Box Office : ఛావాను కొట్టలేకపోయిన సల్మాన్.. షాకిచ్చేలా సికందర్‌‌‌ ఓపెనింగ్స్, ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా దక్షిణాది దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం సికందర్. రంజాన్, ఉగాది పండుగల కానుకగా ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విక్కీ కౌశల్ నటించిన ఛావా తర్వాత హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్‌కు ఛావా ఊపిరిపోయగా దీనిని సికందర్ కంటిన్యూ చేసిందా? లేదా? బాక్సాఫీస్ వద్ద సల్మాన్ చిత్రం ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే:

సికందర్‌లో సత్యరాజ్, శర్మాన్ జోషి, ప్రతీక్ బబ్బర్, కిషోర్, జతిన్ శర్మ, సంజయ్ కపూర్, నవాబ్ షా తదితరులు కీలకపాత్ర పోషించారు. నదియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సాజిద్ నదియాడ్‌వాలా నిర్మించారు. నటీనటులు , సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రచార కార్యక్రమాలతో కలిపి సికందర్ సినిమాకు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ అయ్యింది.

Salman Khan s Sikandar Day 1 Box Office Collection worldwide report

సల్మాన్ - ఏఆర్ మురగదాస్ కాంబోతో పాటు టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో సికందర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే సికందర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.165 కోట్ల వ్యాపారం జరిగినట్లుగా బీటౌన్ టాక్. దీనిని బట్టి సికందర్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.170 కోట్ల షేర్.. రూ.340 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

కిసి కా భాయ్ కిసి కా జాన్ సినిమా డిజాస్టర్ తర్వాత సల్మాన్ నటించిన చిత్రం కావడంతో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. దాంతో సికందర్‌పై క్రేజ్ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను సుమారుగా 6000 స్క్రీన్లలో విడుదల చేశారు. దాంతో సికందర్ ఓపెనింగ్స్‌పై చర్చ నడుస్తోంది. వీకెండ్ , ఫెస్టివల్ సీజన్ కావడంతో సల్మాన్ ఖాన్ సినిమాకు మంచి ఆక్యూపెన్సినీ అందుకుంది.

మార్నింగ్ షోలకు మందకొడిగా బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ, మ్యాట్నీ నుంచి పుంజుకుంది. ఉదయం ఆటలకు 13.76 శాతం, మ్యాట్నీకి 24 శాతం, ఫస్ట్ షోకు 25.08 శాతం, సెకండ్ షోలకు 23.55 శాతం చొప్పున ఓవరాల్‌గా 21.60 శాతం ఆక్యూపెన్సీ అందుకుంది సికందర్. ఢిల్లీలో 1894 షోలు, ముంబైలో 1381 షోలు, అహ్మదాబాద్‌లో 913, పూణేలో 614, సూరత్‌లో 549, బెంగళూరులో 474 షోలు ప్రదర్శితమయ్యాయి.

తొలి రోజు సికందర్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.26 కోట్ల ఓపెనింగ్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఆఫ్‌లైన్ టికెట్ సేల్స్‌తో కలిపి ఈ మొత్తం రూ. 28 నుంచి రూ.30 కోట్ల వరకు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఓపెనింగ్స్ విషయంలో సల్మాన్ ఖాన్ నిరాశపరిచాడు. భారీ ఎత్తున రిలీజైన సికందర్.. ఛావా ఓపెనింగ్స్ (రూ.31)ను దాటలేకపోయింది. సల్మాన్ గత చిత్రాలు టైగర్ 3 (రూ.53.3 కోట్లు), సుల్తాన్ (రూ.36.54 కోట్లు) రంజాన్ సమయంలోనే రిలీజై ఓపెనింగ్స్ విషయంలో బాక్సాఫీస్‌ను రూల్ చేశాయి. కానీ సికందర్ ఆ వసూళ్లను అధిగమించలేకపోయింది. మరి తొలి వారం సల్మాన్ ఖాన్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X