Sikandar Box Office : గాడినపడ్డ సికందర్.. సల్మాన్ మూవీకి ఊపిరిపోసిన ఈద్, ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రంజాన్‌ సీజన్ బాలీవుడ్‌కు బాగా కలిసొచ్చే టైం అందుకే సల్మాన్ తన చిత్రాలను ఈద్ సమయంలోనే ఉండేలా చూసుకుంటారు. అందుకు తగ్గట్లుగానే ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ సెంటిమెంట్‌తోనే రంజాన్‌‌‌కు సికందర్‌తో వచ్చారు సల్మాన్. భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశించగా పెద్ద షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ చిత్రం రెండో రోజూ ఎలాంటి వసూళ్లు రాబట్టిందో చూస్తే :

సికందర్‌కు మిక్స్‌డ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి అంతగా స్పందన రావడం లేదు. దీనికి తోడు రిలీజ్ రోజే సికందర్ హెచ్‌డీ ప్రింట్ లీక్ కావడం కలకలం రేపుతోంది. చాలా థియేటర్లు జనం లేక కళతప్పినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. పలు చోట్ల షోలు కూడా క్యాన్సిల్ అయినట్లుగా వార్తలు వస్తుండటంతో చిత్ర యూనిట్ టెన్షన్ పడుతోంది. ఇక ఆన్‌లైన్‌లో ఉన్న సికందర్ డౌన్‌లోడ్ లింక్‌లను చిత్ర యూనిట్ తొలగించే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపింది.

Salman Khan s Sikandar Day 2 Collection worldwide report

సికందర్‌ చిత్రానికి దక్షిణాది దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించగా.. కాజల్ అగర్వాల్ కీలకపాత్ర పోషించారు. సత్యరాజ్, శర్మాన్ జోషి, ప్రతీక్ బబ్బర్, కిషోర్, జతిన్ శర్మ, సంజయ్ కపూర్, నవాబ్ షా తదితరులు నటించారు. నదియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సాజిద్ నదియాడ్‌వాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు , సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రచార కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ అయ్యింది.

సల్మాన్ ఖాన్ క్రేజ్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి సికందర్ చిత్రానికి రూ.165 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సల్మాన్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.170 కోట్ల షేర్.. రూ.340 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజైన సికందర్ తొలి రోజు కేవలం రూ.26 కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టి సల్మాన్ ఖాన్ అభిమానులకు షాకిచ్చింది.

ఇక రెండో రోజు వసూళ్ల విషయానికి వస్తే.. మార్నింగ్ షోలకు 8.38 శాతం, మ్యాట్నీలకు 26.70 శాతం, ఫస్ట్ షోలకు 30.18 శాతం, సెకండ్ షోలకు 33.12 శాతం చొప్పున ఓవరాల్‌గా 24.60 శాతం ఆక్యూపెన్నీ సమోదైంది. ఢిల్లీలో 1861, ముంబైలో 1375, అహ్మదాబాద్‌లో 880, పూణేలో 595 షోలు పడ్డాయి. కలెక్షన్ల విషయంలో తొలిరోజు కంటే రెండో రోజూ కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి.

సోమవారం ప్రపంచవ్యాప్తంగా రూ.29 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఆఫ్‌లైన్ టికెట్ సేల్స్‌తో కలిపి ఈ మొత్తం రూ. 31 కోట్ల వరకు ఉండొచ్చని విశ్లేషకుల అంచనా. మొత్తంగా రెండు రోజుల వరకు సికందర్ మూవీ ఇండియా వైడ్‌గా రూ.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.19.25 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.75కోట్ల వసూళ్లను అందుకుంది. వీకెండ్, వరుస సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి సికందర్ ఎలాంటి వసూళ్లు రాబడతాడోనని ఉత్కంఠ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X