Sikandar Day 2 Collections: పండగపూట సల్మాన్‌కు షాక్.. సికందర్‌‌కు షాకింగ్ కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?

తన లక్కీ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం సికందర్. రష్మిక మంద్న హీరోయిన్. రంజాన్ కానుకగా మార్చి 30న సికందర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సికందర్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు నిరాశపరిచింది. దారుణమైన ఓపెనింగ్స్‌తో బాలీవుడ్‌కు, సల్మాన్ అభిమానులకు షాకిచ్చింది. ఈ నేపథ్యంలో సికందర్ రెండో రోజు ఎలాంటి వసూళ్లను రాబట్టిందో చూస్తే:

సికందర్‌లో కాజల్ అగర్వాల్ కీలకపాత్ర పోషించగ.. సత్యరాజ్, శర్మాన్ జోషి, ప్రతీక్ బబ్బర్, కిషోర్, జతిన్ శర్మ, సంజయ్ కపూర్, నవాబ్ షా తదితరులు నటించారు. నదియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సాజిద్ నదియాడ్‌వాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు , సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రచార కార్యక్రమాలతో కలిపి సికందర్ సినిమాకు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ అయ్యింది.

Salman Khan s Sikandar Day 2 Expected Collection worldwide report

పాటలు, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో సికందర్ సినిమాపై భారీ హైప్ నెలకొంది. అందుకు తగినట్లుగానే సికందర్ చిత్రానికి రూ.165 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సల్మాన్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.170 కోట్ల షేర్.. రూ.340 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉందని ట్రేడ్ పండితులు నిర్దేశించారు. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా సికందర్‌ను దాదాపు 6000 స్క్రీన్లలో విడుదల చేశారు. ఛావా రికార్డ్స్‌ను, బాలీవుడ్ చిత్రాల వసూళ్లను సికందర్ బద్ధలు కొడుతుందని ప్రచారం జరగ్గా అందుకు విరుద్ధంగా సల్మాన్ మూవీకి ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు కేవలం రూ.26 కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే అందుకున్నట్లు సాక్‌నిక్ తెలిపింది.

వీకెండ్, పండగ సెలవులను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేకర్స్ సికందర్‌ను సాంప్రదాయానికి భిన్నంగా శుక్రవారానికి బదులు ఆదివారం విడుదల చేశారు. కానీ మార్నింగ్ షో నుంచే సల్మాన్ ఖాన్ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడం, థియేటర్‌లలో కొన్ని సినిమాల నుంచి పోటీ ఎదురుకావడంతో సికందర్‌ రికార్డు వసూళ్లను అందుకోలేకపోయింది. ఇక రెండో రోజూ ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే.. సాయంత్రం 4 గంటల వరకు ఓవరాల్‌గా 17.54 శాతం ఆక్యూపెన్సీని అందుకుంది. ఢిల్లీలో 1848, ముంబైలో 1353, అహ్మదాబాద్‌లో 861, పూణేలో 588, కోల్‌కతాలో 469 షోలు పడ్డాయి.

రంజాన్ పర్వదినం కావడంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆదరణ బాగుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండో రోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ చిత్రం రూ.11.78 కోట్ల వసూళ్లు సాధించినట్లు సాక్‌నిక్ తెలిపింది. సికందర్ మూవీ రంజాన్ రోజు రూ.18 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని.. ఆఫ్ లైన్ సేల్స్ బాగుంటే ఇది రూ.20 కోట్ల వరకు చేరుకుంటుందని ట్రేడ్ పండితుల అంచనా. మొత్తంగా రెండు రోజుల వరకు సికందర్ మూవీ ఇండియాలో 35.47 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.18.82 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.54.29 కోట్ల వసూళ్లను అందుకుంది. మరి వర్కింగ్ డేస్‌లో సల్మాన్ ఖాన్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X