Sikandar Day 3 Collection : 100 కోట్లు ఔట్.. సల్మాన్ మాస్ జాతర, మూడో రోజు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్.. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో మంచి ఊపు మీదున్న రష్మి మందన్న జంటగా నటించిన చిత్రం సికందర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా డల్‌గా ముందుకెళ్తుంది. ఛావా ఓపెనింగ్స్ రికార్డును బద్ధలు కొడుతుందని బాలీవుడ్ వర్గాలు వేసిన అంచనాను తలకిందులు చేస్తూ సికందర్‌కు షాకింగ్ కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు రంజాన్ పర్వదినం కావడంతో కాస్త బెటర్ రిజల్ట్ కనిపించింది. మరి మూడో రోజు సల్మాన్ ఖాన్ - రష్మికల చిత్రానికి ఎన్ని కోట్ల వసూళ్లు దక్కాయో చూస్తే:

సికందర్‌‌లో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కీలకపాత్ర పోషించారు. సత్యరాజ్, శర్మాన్ జోషి, ప్రతీక్ బబ్బర్, కిషోర్, జతిన్ శర్మ, సంజయ్ కపూర్, నవాబ్ షా తదితరులు నటించారు. నదియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సాజిద్ నదియాడ్‌వాలా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు , సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రచార కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ అయ్యింది.

Salman Khan s Sikandar Day 3 Collection worldwide report

సికందర్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.165 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సల్మాన్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.170 కోట్ల షేర్.. రూ.340 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. సల్మాన్ క్రేజ్, రష్మికల దూకుడు చూస్తే ఖచ్చితంగా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ పండితులు భావించారు. అయితే తొలిరోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కేవలం రూ.26 కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. అయితే రంజాన్ పండుగ నాడు మాత్రం సికందర్ కాస్త మెరుగైన వసూళ్లు రాబట్టింది.

రెండు రోజులు , అది కూడా ఫస్ట్ వీకెండ్‌లో కేవలం రూ.74 కోట్లు మాత్రమే సల్మాన్ ఖాన్ అందుకున్నాడు. అయితే సల్మాన్ ఖాన్ కెరీర్‌‌లో విడుదలైన చిత్రాల్లో ఫస్ట్ వీకెండ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో సికందర్ స్థానం సంపాదించలేకపోయింది. రూ.148.50 కోట్లతో టైగర్ 3 టాప్‌లో ఉండగా.. టైగర్ జిందా హై రూ.114.93 కోట్లు, రేస్ 3 రూ.106.47 కోట్లు, సుల్తాన్ రూ.105.53 కోట్లు, బజరంగీ భాయిజాన్ రూ. 102.6 కోట్లతో టాప్ 5లో నిలవగా.. దబాంగ్ 3 రూ.81.15 కోట్లతో పదో స్థానంలో నిలిచింది. కనీసం దబాంగ్ ఓపెనింగ్స్‌ను కూడా సికందర్ కొట్టలేకపోవడం సల్మాన్ ఖాన్ అభిమానులకు షాకిచ్చింది.

ఇక మూడో రోజు సికందర్ వసూళ్ల విషయానికి వస్తే .. వీకెండ్, ఈద్ పండుగ ముగిసిన తర్వాత కూడా సల్మాన్ ఖాన్ మెరుగైన ఫలితాలనే రాబట్టాడు. మూడో రోజు ఉదయం మందకొడిగా బుకింగ్ ప్రారంభమైనప్పటికీ సాయంత్రానికి బుకింగ్స్ పెరిగాయి. మార్నింగ్ షోలకు 6.87 శాతం, మ్యాట్నీలకు 18.91 శాతం, ఫస్ట్ షోలకు 25.99 శాతం, సెకండ్ షోలకు 25.89 శాతం చొప్పున మొత్తంగా 19.42 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. ఢిల్లీలో 1778, ముంబైలో 1283, అహ్మదాబాద్‌లో 869, సూరత్‌లో 503, పూణేలో 496 చొప్పున షోలు పడ్డాయి.

మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా సికందర్ చిత్రం రూ.19.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్‌తో కలిపితే ఇది రూ.21 కోట్లు ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు భారత్‌లో రూ.74.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.30 కోట్లు చొప్పున రూ. 105.88 కోట్ల వసూళ్లతో మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు సికందర్. మరి రానున్న రోజుల్లో సల్మాన్ ఖాన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X