శాటిలైట్ కు కూడా దిక్కులేని సలోని
మర్యాద రామన్న తర్వాత వెంటనే సలోని బుక్కైన సినిమా 'తెలుగమ్మాయి'. అయితే ఆ సినిమా రిలిజయ్యే వాతావరణం కనపడటం లేదు. చివరకు శాటిలైట్ రైట్స్ ద్వారా అయినా కొద్దో గొప్పో రాబడదామన్న దర్శక, నిర్మాతల ఆలోచనలు ఫలించేటట్లు కనపడటం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయి నెల రోజుల పైనే అయిన ఈ సినిమాని జూన్‌లోనే విడుదల చేయాలని మొదట నిర్మాతలు భావించారు. అయితే బిజినెస్ ఒక్క ఏరియా కూడా కాలేదు. కేవలం సలోని సినిమా అన్న ముద్ర తప్ప సినిమాలో మరే ఎట్రాక్షన్ లేకపోవటమే మైనస్ అయిందంటున్నారు.
దాంతో ఈ నెల 24న ఆడియో ఫంక్షన్ని ఆర్భాటంగా జరిపి బయ్యర్లని ఆకట్టుకోవాలని ప్లాన్ చేశారు. అయినా బయ్యర్లు ఎవరూ ముందుకు రావటం లేదని ట్రేడ్ లో వినపడుతోంది. ఎవరూ రాకపోతే సొంతంగా విడుదల చేయాలని ఆలోచనలో పడ్డారు. దాంతో మర్యాద రామన్న వెంటనే వచ్చిన ఈ సినిమాతోనన్నా మరికొన్ని ఛాన్సులు దక్కించుకోవాలని చూస్తున్న సలోని ఆశలు నీరైనట్లే అంటున్నారు.
ఇక 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'ఆదివారం ఆడవాళ్లకు సెలవు' వంటి ఫ్యామిలీ కామిడీ చిత్రాల దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. చేగొండి హరిరామజోగయ్య నిర్మాణ సారథిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఓ అమ్మాయి, నలుగురు అబ్బాయిల మధ్య నడిచే కథతో తయారైంది. ఆ నలుగురు అబ్బాయిల్లో యశ్వంత్, విక్రం (ఎమ్మెస్ నారాయణ కొడుకు) ఉన్నారు.


Click it and Unblock the Notifications











