Sam Bahadur 100 కోట్ల క్లబ్‌లో చేరిన సామ్ బహద్దూర్.. యానిమల్ ప్రభంజనాన్ని ఎదురించి మొత్తం ఎన్ని కోట్లంటే?
ఇండియాలో తొలి ఫీల్డ్ మార్షల్, లెజెండరీ ఆర్మీ జనరల్ సామ్ హెచ్ఎఫ్ మాణిక్ షా జీవితం ఆధారంగా సామ్ బహద్దూర్ తెరకెక్కింది. మాణిక్ షా పాత్రలో యువ హీరో వికీ కౌశల్ నటించగా, మాణిక్ షా భార్యగా సాన్య మల్హోత్రా, ఇందిరా గాంధీ పాత్రలో ఫాతిమా సనా షేక్, జవహర్ లాల్ నెహ్రూగా నీరజ్ కాబీ, లార్డ్ మౌంట్ బ్యాటెన్‌టా ఎడ్వార్డ్ సానెన్ బ్లిక్, సర్దార్ వల్లభాయ్ పటేల్‌గా గోవింద్ నామ్‌దేవ్ నటించారు. ఈ సినిమా తొలివారంలో తడబాటుకు గురైనప్పటికీ.. ఆ తర్వాత పుంజుకొని రికార్డు కలెక్షన్లు సాధించింది. ఇప్పటి వరకు ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సామ్ బహద్దూర్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా హిందీ సినిమా పరిశ్రమలో రిలీజైంది. అయితే యానిమల్‌తో పోటి పడుతూ రిలీజ్ కావడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించలేకపోయింది. సచిన్ టెండూల్కర్ లాంటి ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడంతో అందరి దృష్టిపడింది.

సామ్ బహద్దూర్ సినిమా బడ్జెట్, బిజినెస్ విషయానికి వస్తే.. ఈ మూవీ 65 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా 75 కోట్ల రూపాయలు నిర్ణయించారు. అలాగే ఈ సినిమాను ఇండియాలో 1300 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 1900 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అలా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
యానిమల్ సినిమా ప్రభంజనం కారణంగా సామ బహద్దూర్ సినిమా కలెక్షన్ల పరంగా వెనుకబడింది. ఈ సినిమా తొలి రోజు 6.25 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా తొలి వారం 39 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండోవారంలో ఈ చిత్రం 26 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 65 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక మూడో వారంలో కూడా సామ్ బహద్దూర్ బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధించింది. 15వ రోజున ఈ చిత్రం 2.25 కోట్లు, 16వ రోజున 4.5 కోట్లు, 17వ రోజున 5.25 కోట్లు, 18వ రోజున 1.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 79 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా సామ్ బహద్దూర్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియాలో 79 కోట్ల షేర్, అలాగే ఓవర్సీస్‌లో ఈ మూవీ 2.1 మిలియన్ డాలర్లు అంటే.. 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 97 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. ఓవరాల్‌లో ఈ చిత్రం 106 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.


Click it and Unblock the Notifications











