Sam Bahadur Collections సచిన్ మెచ్చిన సినిమాకు బాక్సాఫీస్ తడబాటు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

బాలీవుడ్‌లో యువ హీరో వికీ కౌశల్ నటించిన సామ్ బహద్దూర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లు సాధిస్తున్నది. లెజెండరీ ఆర్మీ జనరల్ సామ్ హెచ్ఎఫ్ మాణిక్ షా బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్నది. ఈ సినిమాకు భారీ ప్రశంసలు దక్కినా కొంత మేరకు కలెక్షన్ల పరంగా తడబాటుకు గురవుతున్నది. ఈ సినిమా 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఇండియాలో తొలి ఫీల్డ్ మార్షల్, లెజెండరీ ఆర్మీ జనరల్ సామ్ హెచ్ఎఫ్ మాణిక్ షా జీవితం ఆధారంగా సామ్ బహద్దూర్ తెరకెక్కింది. ఈ చిత్రంలో మాణిక్ షా భార్యగా సాన్య మల్హోత్రా, ఇందిరా గాంధీ పాత్రలో ఫాతిమా సనా షేక్, జవహర్ లాల్ నెహ్రూగా నీరజ్ కాబీ, లార్డ్ మౌంట్ బ్యాటెన్‌టా ఎడ్వార్డ్ సానెన్ బ్లిక్, సర్దార్ వల్లభాయ్ పటేల్‌గా గోవింద్ నామ్‌దేవ్ నటించారు.

Sam Bahadur 5 days Box office Collections worldwide: Vicky Kaushal movie inching towards 50 crores

సామ్ బహద్దూర్ సినిమాను క్వాలిటీకి కోసం ఏ మాత్రం రాజీ పడకుండా భారీ వ్యయంతో తెరకెక్కించారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్‌, ప్రమోషన్స్‌తో కలిపి ఈ సినిమా 65 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1800 స్కీన్లలో రిలీజ్ చేశారు. ఇండియాలో 1250 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు.

సామ్ బహద్దూర్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 6.25 కోట్ల రూపాయలు, రెండో రోజు 9 కోట్ల రూపాయలు, మూడో రోజు 10.3 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం 32 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక ఐదో రోజు సామ్ బహద్దూర్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈమూవీ దేశవ్యాప్తంగా 30 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. ఢిల్లీ, పూణే, ఆహ్మదాబాద్, ముంబైలో ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ సినిమా 5వ రోజు సుమారుగా కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 35 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక సామ్ బహద్దూర్ ఓవర్సీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా ఓవర్సీస్‌లో కేవలం 4.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా దాదాపు 40 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 65 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను దాటుతుందా లేదా? అనేది వేచి చూడాల్సిందే.

Sam Bahadur 5 days Box office Collections worldwide: Vicky Kaushal movie inching towards 50 crores

సామ్ బహద్దూర్ సినిమాకు మంచి ఫీడ్ బ్యాక్ ఉన్నప్పటికీ.. యానిమల్ ప్రభంజనం కారణంగా కలెక్షన్లను రాబట్టలేకపోతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సచిన్ లాంటి ప్రముఖులు మెచ్చినా ఆక్యుపెన్సీని పెంచుకోలేకపోతున్నది.రెండో వారంలో ఈ సినిమా పుంజుకొంటుందా అనే ప్రశ్నగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X