Samajavaragamana Collections చిన్న సినిమా అదిరిపోయే లాభాలు.. సామజవరగమనకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో యువ హీరో, హీరోయిన్లు శ్రీ విష్ణు, రెబ్బా మోనిక జాన్ జంటగా వీకే నరేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రాజేష్ దండ నిర్మించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఈ సినిమా 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

సామజవరగమన చిత్రం సుమారు 8 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాను భారీగా రిలీజ్ చేశారు. నైజాంలో 100 స్క్రీన్లు, సీడెడ్‌లో 60 స్క్రీన్లు, ఆంధ్రాలో 160 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 320 స్క్రీన్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో 60 స్క్రీన్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Samajavaragamana 5 days collections worldwide: Sreevishnu movie into big profits

సామజవరగమన చిత్రం తొలి రోజున ఏపీ, నైజాంలో 1.30 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా 2.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు ఇండియాలో 1.5 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 1.9 కోట్ల గ్రాస్, మూడో రోజు ఇండియా వైడ్ 1.85 ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక నాలుగో రోజున నాలుగో రోజు 2.05 కోట్లు గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఐదో రోజు 1.15 కోట్లు

సామజవరగమన నాలుగో రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మౌత్ టాక్ భారీగా స్ప్రెడ్ కావడంతో కలెక్షన్లు నిలకడగా, భారీగా నమోదు అవుతున్నాయి. మార్నింగ్ షోకు 20 శాతం, మ్యాట్నీకి 25 శాతం, ఫస్ట్ షోకు 25 శాతం, సెకండ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

Samajavaragamana 5 days collections worldwide: Sreevishnu movie into big profits

ఇక ఐదో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. సోమవారం సాధారణంగా కలెక్షన్లు డ్రాప్ అవ్వడం సహజం. కానీ బాక్సాఫీస్ వద్ద నిలకడగా ఈ సినిమా నిలబడటంతో మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం ఇండియాలో 1.20 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

సామజవరగమన చిత్రం అమెరికాలో భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం అమెరికాలో ఇప్పటి వరకు 440k డాలర్ల వసూళ్లను సాధించింది. సోమవారం వర్కింగ్ డే రోజున అత్యధికంగా కలెక్షన్లు రాబట్టడం సెన్సేషనల్‌గా మారింది. అమెరికాలో 5వ రోజు 75K డాలర్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ఓవర్సీస్‌లో 3.6 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

సామజవరగమన సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకొన్నారు. ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్‌ను 4 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. దాంతో ఈ సినిమా 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ సినిమా మూడో రోజునే లాభాల్లోకి ప్రవేశించింది. ఈ చిత్రం భారీ లాభాల వైపు దూసుకెళ్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X