Samajavaragamana Collections: తెలుగులో సంచలనం.. 11 రోజుల్లో రికార్డు వసూళ్లు.. లాభమే అన్ని కోట్లా!

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే ప్రతి సినిమాలోనూ అసాధారణ నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా వన్ మ్యాన్ షోతో హైలైట్ అవుతున్నారు. అందులో శ్రీ విష్ణు ఒకడు.

పక్కింటి అబ్బాయిలా ఉండే అతడు.. కొంత కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే 'సామజవరగమన' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' 11 రోజుల రిపోర్టును మీరే చూడండి!

Samajavaragamana Movie 11 Days Official Worldwide Box Office Collections

ఫుల్ కామెడీతో సామజవరగమన: శ్రీ విష్ణు హీరోగా - రామ్ అబ్బరాజు తెరకెక్కించిన కామెడీ చిత్రమే 'సామజవరగమన'. ఈ మూవీలో రెబా మౌనికా జాన్ హీరోయిన్ నటించింది. నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, దేవీ ప్రసాద్ కీలక పాత్రలను చేశారు. దీనికి గోపీ సుందర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, అనిల్ సుంకర నిర్మించారు.

Samajavaragamana Movie 11 Days Official Worldwide Box Office Collections

సామజవరగమన బిజినెస్ ఇలా: ఈసారి సరైన హిట్ కొట్టాలన్న కసిలో ఉన్న శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు బాగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లే గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Samajavaragamana Movie 11 Days Official Worldwide Box Office Collections

11వ రోజు తెలుగులో ఎంతంటే?: 'సామజవరగమన'కు కూడా తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు అదిరే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 38 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రూ. 93 లక్షలు షేర్, రూ. 1.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

Samajavaragamana Movie 11 Days Official Worldwide Box Office Collections

11వ రోజులకు కలిపితే ఎంత?: 11 రోజుల్లో 'సామజవరగమన'కు ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్‌ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 3.37 కోట్లు, సీడెడ్‌లో రూ. 97 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.15 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 61 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, గుంటూరులో రూ. 58 లక్షలు, కృష్ణాలో రూ. 61 లక్షలు, నెల్లూరులో రూ. 33 లక్షలతో.. రూ. 8.05 కోట్లు షేర్, రూ. 14.80 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Samajavaragamana Movie 11 Days Official Worldwide Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా: కామెడీ స్టోరీతో వచ్చిన 'సామజవరగమన' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 11 రోజుల్లో రూ. 8.05 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 3.55 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 11 రోజుల్లోనే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.60 కోట్లు షేర్‌తో పాటు రూ. 22.85 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Samajavaragamana Movie 11 Days Official Worldwide Box Office Collections

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత: శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.50 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో దీనికి రూ. 11.60 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 8.10 కోట్లు లాభాలతో సంచలన రికార్డును నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X