Samajavaragamana Collections: 13వ రోజు షాకింగ్‌గా.. ఏకంగా అన్ని కోట్లు.. లాభాలతో సెన్సేషనల్ రికార్డు

వైవిధ్యమైన నటనతో పాటు క్రేజీ కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో పక్కింటి అబ్బాయి లాంటి మంచి పేరును సంపాదించుకున్నాడు శ్రీ విష్ణు. ప్రతి సినిమాలోనూ అదిరిపోయే యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేస్తున్న అతడు.. విజయాలను పెద్దగా అందుకోకున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఈ పరిస్థితుల్లో ఇటీవలే శ్రీ విష్ణు 'సామజవరగమన' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ రెండో వారంలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' 13 రోజుల రిపోర్టును మీరే చూడండి!

Samajavaragamana Movie 13 Days Official Worldwide Box Office Collections

సామజవరగమన అని వచ్చాడు: శ్రీ విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రమే 'సామజవరగమన'. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీలో రెబా మౌనికా జాన్ హీరోయిన్ నటించింది. నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, దేవీ ప్రసాద్ కీలక పాత్రలను చేశారు. దీనికి గోపీ సుందర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, అనిల్ సుంకర నిర్మించారు.

Samajavaragamana Movie 13 Days Official Worldwide Box Office Collections

సామజవరగమన బిజినెస్ ఇలా: చాలా కాలంగా హిట్ లేక బాధ పడతున్నా.. శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు బాగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లే గ్రాండ్‌గా దీన్ని రిలీజ్ చేసేశారు.

Samajavaragamana Movie 13 Days Official Worldwide Box Office Collections

13వ రోజు తెలుగులో ఎంతంటే?: 'సామజవరగమన'కు కూడా తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 31 లక్షలు షేర్, రూ. 65 లక్షలు గ్రాస్ వచ్చింది.

Samajavaragamana Movie 13 Days Official Worldwide Box Office Collections

13వ రోజులకు కలిపితే ఎంత?: 'సామజవరగమన'కు 13 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్‌ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 3.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.01 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.26 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 67 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 47 లక్షలు, గుంటూరులో రూ. 63 లక్షలు, కృష్ణాలో రూ. 65 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో.. రూ. 8.71 కోట్లు షేర్, రూ. 15.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Samajavaragamana Movie 13 Days Official Worldwide Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా: ఫ్యామిలీ స్టోరీతో వచ్చిన 'సామజవరగమన' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 13 రోజుల్లో రూ. 8.71 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 4.18 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 13 రోజుల్లోనే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.89 కోట్లు షేర్‌తో పాటు రూ. 25.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత: శ్రీ విష్ణు హీరోగా చేసిన 'సామజవరగమన' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.50 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లో దీనికి రూ. 12.89 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 9.39 కోట్లు లాభాలతో సంచలన రికార్డును నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X