Samajavaragamana Collections: చరిత్ర సృష్టించిన శ్రీ విష్ణు.. 16 రోజుల్లోనే అన్ని కోట్లతో ఊచకోత
తెలుగులో సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోలు అతి తక్కువ మందే ఉన్నారు. అందులో టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ఒకడు. ప్రతి సినిమాను తనదైన నటనతో వన్ మ్యాన్ షోగా మార్చేస్తున్న అతడు.. రిజల్ట్ విషయంలో మాత్రం సక్సెస్ అవడం లేదు.
మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే శ్రీ విష్ణు ఇటీవలే 'సామజవరగమన' అనే సినిమాతో వచ్చాడు. ఈ మూవీ మూడో వారంలోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో శ్రీ విష్ణు మూవీ 16 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

సామజవరగమనతో వచ్చాడు: శ్రీ విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రమే 'సామజవరగమన'. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీలో రెబా మౌనికా జాన్ హీరోయిన్ నటించింది. నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, దేవీ ప్రసాద్ కీలక పాత్రలను చేశారు. దీనికి గోపీ సుందర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, అనిల్ సుంకర నిర్మించారు.

సామజవరగమన బిజినెస్ ఇలా: శ్రీ విష్ణు హీరోగా చేసిన 'సామజవరగమన' మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాల వల్ల దీనిపై ఆరంభం నుంచే అంచనాలు బాగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లే గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

16వ రోజు తెలుగులో ఎంతంటే?: చాలా కాలంగా హిట్ కోసం వేచి చూస్తున్న శ్రీ విష్ణు హీరోగా నటించిన 'సామజవరగమన' మూవీకి మూడో వారంలోనూ మంచి స్పందననే అందుకుంటోంది. అయితే, శుక్రవారం పలు చిత్రాలు రిలీజ్ అవడంతో దీనికి రెస్పాన్స్ తగ్గింది. ఫలితంగా 15వ రోజు రూ. 21 లక్షలు షేర్ రాబట్టిన ఈ చిత్రం.. 16వ రోజు మాత్రం కేవలం రూ. 16 లక్షలు షేర్‌ను ఖాతాలో వేసుకుంది.

16వ రోజులకు కలిపితే ఎంత?: 'సామజవరగమన'కు ఏపీ, తెలంగాణలో 16 రోజుల్లో భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 3.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.03 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.65 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 72 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 50 లక్షలు, గుంటూరులో రూ. 67 లక్షలు, కృష్ణాలో రూ. 69 లక్షలు, నెల్లూరులో రూ. 38 లక్షలతో.. రూ. 9.59 కోట్లు షేర్, రూ. 18.05 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా: అదిరిపోయే ఫన్‌తో వచ్చిన 'సామజవరగమన' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 16 రోజుల్లో రూ. 9.59 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 4.41 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 16 రోజుల్లోనే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.00 కోట్లు షేర్‌తో పాటు రూ. 28.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత: శ్రీ విష్ణు హీరోగా నటించిన 'సామజవరగమన' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.50 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లో దీనికి రూ. 14.00 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10.50 కోట్లు లాభాలతో శ్రీ విష్ణు చరిత్ర సృష్టించాడు.


Click it and Unblock the Notifications











