Samajavaragamana Collections: 17వ రోజు పెరిగిన వసూళ్లు.. లాభాలతో సంచలనం.. 1.10 కోట్లు వస్తే చరిత్రే

వైవిధ్యమైన నటన, విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో నేచురల్ యాక్టర్‌గా సత్తా చాటుతోన్నాడు శ్రీ విష్ణు. ఫలితాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్న అతడు.. ఇటీవలే 'సామజవరగమన' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచీ అదిరిపోయే స్పందన దక్కుతోంది. ఇలా మూడో వారంలోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే 16వ రోజు దీనికి వసూళ్లు పెరిగాయి. మరి ఆలస్యం లేకుండా 'సామజవరగమన' రిపోర్టు మీరే చూడండి!

ఫుల్ ఫన్‌తో సామజవరగమన : టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రమే 'సామజవరగమన'. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీలో రెబా మౌనికా జాన్ హీరోయిన్ చేసింది. నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, దేవీ ప్రసాద్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, అనిల్ సుంకర నిర్మించారు. గోపీ సుందర్ మ్యూజిక్ ఇచ్చారు.

samajavaragamana
సామజవరగమన బిజినెస్ ఇలా : శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాల వల్ల దీనిపై ఆరంభం నుంచే అంచనాలు బాగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లే చాలా థియేటర్లలో రిలీజ్ చేశారు.
samajavaragamana

17వ రోజు తెలుగులో ఎంతంటే : కొంత కాలంగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతోన్న శ్రీ విష్ణు హీరోగా నటించిన 'సామజవరగమన' మూవీకి మూడో వారంలోనూ మంచి స్పందననే అందుకుంటోంది. అయితే, శుక్రవారం పలు చిత్రాలు రిలీజ్ అవడంతో దీనికి రెస్పాన్స్ తగ్గింది. కానీ, శనివారం మరోసారి పుంజుకుని మంచిగానే రాణించింది. దీంతో 17వ రోజు ఈ మూవీ రూ. 20 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

samajavaragamana

17వ రోజులకు కలిపితే ఎంత : 17 రోజుల్లో 'సామజవరగమన'కు ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్‌ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 4.03 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.68 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 74 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, గుంటూరులో రూ. 69 లక్షలు, కృష్ణాలో రూ. 71 లక్షలు, నెల్లూరులో రూ. 39 లక్షలతో.. రూ. 9.79 కోట్లు షేర్, రూ. 18.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

samajavaragamana

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా : ఫన్ ఎంటర్‌టైనర్‌ 'సామజవరగమన' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 17 రోజుల్లో రూ. 9.79 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 4.50 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 17 రోజుల్లోనే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.29 కోట్లు షేర్‌తో పాటు రూ. 28.90 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

samajavaragamana
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత : 'సామజవరగమన' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.50 కోట్లుగా నమోదైంది. ఇక, 17 రోజుల్లో దీనికి రూ. 14.29 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10.79 కోట్లు లాభాలు దక్కాయి. ఇక, ఈ చిత్రం రూ. 1.10 కోట్లు గ్రాస్ రాబడితే రూ. 30 కోట్ల క్లబ్‌లో చేరుతుంది. అదే జరిగితే శ్రీ విష్ణు రికార్డు సాధిస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X