Samajavaragamana Collections: 18వ రోజు ఫుల్లు వసూళ్లు.. అన్ని కోట్లు దాటిన లాభాలు.. 15 లక్షల దూరంలో!
టాలీవుడ్‌లో కెరీర్ ఆరంభం నుంచీ డిఫరెంట్ సినిమాలు చేస్తూ విభిన్నమైన ఇమేజ్‌ను దక్కించుకున్న హీరోల్లో టాలెంటెడ్ గాయ్ శ్రీ విష్ణు ఒకడు. నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న అతడు.. అప్పుడప్పుడూ హిట్లను కూడా అందుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'సామజవరగమన' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మొదటి నుంచీ అదిరిపోయే స్పందన దక్కుతోంది. ఇలా మూడో వారంలోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే 18వ రోజు దీనికి వసూళ్లు పోటెత్తాయి. మరి ఈ మూవీ రిపోర్టు మీరే చూడండి!
కామెడీ స్టోరీతో సామజవరగమన: నేచురల్ యాక్టర్ శ్రీ విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రమే 'సామజవరగమన'. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీలో రెబా మౌనికా జాన్ హీరోయిన్ చేసింది. నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, దేవీ ప్రసాద్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, అనిల్ సుంకర నిర్మించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.

సామజవరగమన బిజినెస్ ఇలా: టాలెంటెడ్ గాయ్ శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాల వల్ల దీనిపై ఆరంభం నుంచే అంచనాలు బాగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
18వ రోజు తెలుగులో ఎంతంటే?: ఈ సారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలన్న పట్టుదలతో శ్రీ విష్ణు హీరోగా నటించిన 'సామజవరగమన' మూవీకి మూడో వారంలోనూ మంచి స్పందననే అందుకుంటోంది. అయితే, శుక్రవారం పలు చిత్రాలు రిలీజ్ అవడంతో దీనికి రెస్పాన్స్ తగ్గింది. కానీ, శనివారం నుంచి బాగా పుంజుకుంది. దీంతో 17వ రోజు రూ. 20 లక్షలు రాబట్టి.. 18వ రోజు ఏకంగా రూ. 36 లక్షలు వసూలు చేసింది.

18వ రోజులకు కలిపితే ఎంత?: 'సామజవరగమన'కు 18 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 4.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.75 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 76 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 52 లక్షలు, గుంటూరులో రూ. 72 లక్షలు, కృష్ణాలో రూ. 75 లక్షలు, నెల్లూరులో రూ. 40 లక్షలతో.. రూ. 10.15 కోట్లు షేర్, రూ. 19.20 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా: కామెడి స్టోరీతో వచ్చిన 'సామజవరగమన' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 18 రోజుల్లో రూ. 10.15 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 4.60 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 18 రోజుల్లోనే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.75 కోట్లు షేర్‌తో పాటు రూ. 29.85 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత: 'సామజవరగమన' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.50 కోట్లుగా నమోదైంది. ఇక, 18 రోజుల్లో దీనికి రూ. 14.75 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 11.25 కోట్లు లాభాలు దక్కాయి. ఇక, ఈ చిత్రం రూ. 15 లక్షలు గ్రాస్ రాబడితే రూ. 30 కోట్ల క్లబ్‌లో చేరి శ్రీ విష్ణు కెరీర్‌లో గొప్ప రికార్డును నమోదు చేస్తుంది.


Click it and Unblock the Notifications











