Samajavaragamana Collections: శ్రీ విష్ణు సంచలనం.. వారంలోనే డబుల్.. అన్ని కోట్ల లాభాలతో రికార్డు
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ ఆరంభంలోనే సపోర్టింగ్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించి.. ఆ తర్వాత హీరోగా మారి సత్తా చాటుతున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ.. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేమైన ఇమేజ్‌ను ఏర్పరచుకున్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు శ్రీ విష్ణు 'సామజవరగమన' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో 'సామజవరగమన' 7 రోజుల రిపోర్టును మీరే చూడండి!
సామజవరగమన అంటూ వచ్చి:శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు తెరకెక్కించిన సినిమానే 'సామజవరగమన'. ఈ మూవీలో రెబా మౌనికా జాన్ హీరోయిన్ నటించింది. నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, దేవీ ప్రసాద్ కీలక పాత్రలను చేశారు. దీనికి గోపీ సుందర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

సామజవరగమన బిజినెస్ ఇలా:శ్రీ విష్ణు - రెబా మౌనికా జాన్ జంటగా నటించిన 'సామజవరగమన' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు బాగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాలో గ్రాండ్‌గా విడుదలైంది.
7వ రోజు తెలుగులో ఎంతంటే?:'సామజవరగమన'కు 7వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 21 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 51 లక్షలు షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

7వ రోజులకు కలిపితే ఎంత?:'సామజవరగమన'కు 7 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 2.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 64 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 72 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 38 లక్షలు, కృష్ణాలో రూ. 40 లక్షలు, నెల్లూరులో రూ. 23 లక్షలతో.. రూ. 5.32 కోట్లు షేర్, రూ. 9.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా:కామెడీ జోనర్‌లో వచ్చిన 'సామజవరగమన' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో వారం రోజుల్లో రూ. 5.32 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.45 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 7 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.77 కోట్లు షేర్‌తో పాటు రూ. 15.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత:శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.50 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 7.77 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.27 కోట్లు లాభాలను కూడా ఈ చిత్రం సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











