Samajavaragamana Collections: 3.50 కోట్లే రావాలి.. కానీ రెండు వారాల్లో ట్రిపుల్.. వాళ్లకు జాక్‌పాట్

వరుసగా ఫ్లాపులు వస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస పెట్టి సినిమాల చేసుకుంటూ వెళ్లే హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు. విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తోన్న అతడు.. ప్రతి దానిలోనూ వన్ మ్యాన్ షో చేస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు. కానీ, హిట్లను మాత్రం అంతగా అందుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లోనే శ్రీ విష్ణు కొద్ది రోజుల క్రితమే 'సామజవరగమన' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ రెండో వారంలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' 2 వారాల రిపోర్టును మీరే చూడండి!

ఫుల్ కామెడీతో వచ్చిన శ్రీ విష్ణు:శ్రీ విష్ణు హీరోగా.. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన కామెడీ చిత్రమే 'సామజవరగమన'. ఈ మూవీలో రెబా మౌనికా జాన్ హీరోయిన్ నటించింది. నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, దేవీ ప్రసాద్ కీలక పాత్రలను చేశారు. దీనికి గోపీ సుందర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేశారు.

Samajavaragamana Movie 2 Weeks Official Worldwide Box Office Collections

సామజవరగమన బిజినెస్ ఇలా:శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాల వల్ల దీనిపై ఆరంభం నుంచే అంచనాలు బాగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లే గ్రాండ్‌గా దీన్ని తీసుకు వచ్చారు.

14వ రోజు తెలుగులో ఎంతంటే?:14వ రోజూ 'సామజవరగమన'కు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 21 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వచ్చింది.

Samajavaragamana Movie 2 Weeks Official Worldwide Box Office Collections

14వ రోజులకు కలిపితే ఎంత?:14 రోజుల్లో 'సామజవరగమన'కు ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్‌ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 3.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.29 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 69 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, గుంటూరులో రూ. 64 లక్షలు, కృష్ణాలో రూ. 66 లక్షలు, నెల్లూరులో రూ. 36 లక్షలతో.. రూ. 8.92 కోట్లు షేర్, రూ. 16.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Samajavaragamana Movie 2 Weeks Official Worldwide Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా:క్రేజీ కామెడీతో రూపొందిన 'సామజవరగమన' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 వారాల్లో రూ. 8.92 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 4.27 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 14 రోజుల్లోనే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.19 కోట్లు షేర్‌తో పాటు రూ. 26.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Samajavaragamana Movie 2 Weeks Official Worldwide Box Office Collections

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత:శ్రీ విష్ణు హీరోగా నటించిన 'సామజవరగమన' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 వారాల్లో దీనికి రూ. 13.19 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 9.69 కోట్లు లాభాలతో సంచలన రికార్డును నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X