Samajavaragamana Collections: శ్రీ విష్ణు ఊచకోత.. 9 రోజుల్లో అన్ని కోట్లా.. లాభం ఎంతో తెలిస్తే షాకే!
తెలుగులో హిట్లు ఫ్లాపులను పట్టించుకోకుండా సినిమాలు మీద సినిమాలు చేసుకుంటూపోయే యంగ్ హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో టాలెంటెడ్ గాయ్ శ్రీ విష్ణు ఒకడు. బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చినా తన టాలెంట్లను నమ్ముకున్న అతడు.. అడపాదడపా హిట్లను సాధిస్తూ సత్తా చాటుతోన్నాడు.
అయితే, కొంత కాలంగా భారీ సక్సెస్ లేక బాధ పడుతోన్న అతడు.. ఇటీవలే 'సామజవరగమన' అనే సినిమాతో వచ్చాడు. ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' 9 రోజుల రిపోర్టును మీరే చూడండి!

సామజవరగమన .. ఫన్ రైడ్‌తో: శ్రీ విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రమే 'సామజవరగమన'. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీలో రెబా మౌనికా జాన్ హీరోయిన్ నటించింది. నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, దేవీ ప్రసాద్ కీలక పాత్రలను చేశారు. దీనికి గోపీ సుందర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, అనిల్ సుంకర నిర్మించారు.

సామజవరగమన బిజినెస్ ఇలా: శ్రీ విష్ణు - రెబా మౌనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'సామజవరగమన' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు బాగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని రిలీజ్ చేశారు.

9వ రోజు తెలుగులో ఎంతంటే?: 9వ రోజు 'సామజవరగమన'కు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 23 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 57 లక్షలు షేర్, రూ. 1.05 కోట్లు గ్రాస్ వచ్చింది.
9వ రోజులకు కలిపితే ఎంత?: 'సామజవరగమన'కు 9 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 2.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 79 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 90 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 47 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, గుంటూరులో రూ. 44 లక్షలు, కృష్ణాలో రూ. 46 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో.. రూ. 6.32 కోట్లు షేర్, రూ. 11.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా: ఫన్ రైడ్‌గా వచ్చిన 'సామజవరగమన' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొమ్మిది రోజుల్లో రూ. 6.32 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.80 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 9 రోజుల్లోనే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.12 కోట్లు షేర్‌తో పాటు రూ. 17.85 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత: శ్రీ విష్ణు హీరోగా చేసిన 'సామజవరగమన' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.50 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 9.12 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.62 కోట్లు లాభాలను కూడా ఈ చిత్రం సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











